న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాని తేలిగ్గా తీసుకొని.. గొప్ప అవకాశాన్ని వదులుకోలేం: గంభీర్

Biggest opportunity for us but not taking Australia lightly Ishant

హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా విజయ కాంక్షతో రెండో సిరీస్‌కు సిద్ధమవుతోంది. తొలి సిరీస్‌లో ఫలితాన్ని డ్రాగా ముగించగా రెండో ఫార్మాట్‌(టెస్టు సిరీస్‌లో) విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవడమే ఇప్పుడు భారత్ టార్గెట్ అని ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది.

 భారత్ ఆ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా

భారత్ ఆ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా

బాల్ టాంపరింగ్‌ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్‌లు దూరమై ఆస్ట్రేలియా జట్టు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత జరిగిన ఏ ఫార్మాట్‌లోనూ.. ఆసీస్ విజయం దక్కించుకోలేదు. అదీగాక, ఆసీస్ గడ్డపై ఇప్పటివరకూ టీమిండియా మరోవైపు భారత్ జట్టు ఆ గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో.. మునుపటితో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్‌ టీమ్‌పై సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించాలని భారత్ యోచిస్తోంది.

ఆస్ట్రేలియాని తేలికగా తీసుకోవట్లేదు

ఆస్ట్రేలియాని తేలికగా తీసుకోవట్లేదు

డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ జట్టులో లేకపోయినా.. ఆస్ట్రేలియా జట్టుని తేలికగా తీసుకోవట్లేదు. అలా.. అని సిరీస్‌పై అతిగా ఆలోచించి ఒత్తిడినీ పెంచుకోవదలచుకోవట్లేదు. ఆరోజు మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా.. ఆడుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. అయితే.. ఇప్పుడు భారత్ టార్గెట్ ఒక్కటే.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ని గెలవడం. ఈ మేరకు అందరం ఆ లక్ష్యంపై దృష్టి పెట్టాం. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనల గురించి ఆలోచించడం లేదు. సమష్టిగా ఆడాలనే ఉద్దేశ్యంతో పోరాడేందుకు సిద్ధమవుతున్నాం.

పరిస్థితులను అంచనా వేయడమంటే చాలా కష్టం.

పరిస్థితులను అంచనా వేయడమంటే చాలా కష్టం.

మ్యాచ్ ఆరంభానికి ముందే అక్కడి పరిస్థితులను అంచనా వేయడమంటే చాలా కష్టం. ఒకసారి మైదానంలో దిగామంటే దానిని బట్టి ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ దాని గురించి ఎక్కువగా భయపడితే ఆటకు దూరంగా ఉండటమే మంచిది. ఆడేందుకు సిద్ధమైనప్పుడు మాత్రమే వ్యూహాల గురించి ఆలోచిస్తాం. ఇప్పుడే కాదు. ప్రాక్టీస్ గేమ్‌లో ఎలా ఆడదామా అనే విషయం గురించే నిర్ణయం తీసుకుంటున్నాం.

టెస్టు కోసం సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టు:

టెస్టు కోసం సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టు:

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Tuesday, November 27, 2018, 16:15 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X