న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నొప్పి పెరగకూడదనే భారీ షాట్లు ఆడా: హర్మన్‌ప్రీత్

Big hits my way of battling stomach cramps: Harmanpreet Kaur

హైదరాబాద్: మహిళల టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో మొదలైన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌‌ప్రీత్‌ జట్టు 34పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. స్వల్ప విరామంతోనే వికెట్లు కోల్పోతుండగా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌((103; 51 బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సులు), వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమెన్‌ జెమిమా రోడ్రిగ్స్‌ (59; 45 బంతుల్లో 7ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.

క్రమంగా దూకుడు పెంచిన హర్మన్‌..

క్రమంగా దూకుడు పెంచిన హర్మన్‌..

ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వచ్చిన హర్మన్‌.. క్రమంగా దూకుడు పెంచింది. దానికి కారణం లేకపోలేదు. ఒక దశలో ఆమె క్రీజు వదిలి బయటికి వస్తూ భారీ షాట్లు ఆడింది. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకుంది.

భారీ షాట్లు ఆడటానికి కారణం చెప్తూ...

భారీ షాట్లు ఆడటానికి కారణం చెప్తూ...

‘మ్యాచ్‌కు ముందు రోజు కడుపు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డాను. మ్యాచ్‌ ఆరంభానికి ముందు కొంచెం పరవాలేదనిపించినా.. మైదానంలోకి వచ్చి పరుగులు తీయడం ఆరంభించాక పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా కడుపు వద్ద కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి చికిత్స చేసి ఎక్కువసేపు పరిగెత్తితే.. నొప్పి తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నా

భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నా

ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయంగా భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని సహచరురాలైన రోడ్రిగ్స్‌కి వివరించి.. నువ్వు నాకు స్ట్రయికింగ్‌ ఇస్తే.. నేను భారీ షాట్లు కొడతానని చెప్పాను. దానికి ఆమె సహకరించడంతో చివరి వరకూ అదే జోరు కొనసాగించాను. ఈ క్రమంలో నేను ఎన్ని పరుగులు తీస్తున్నా అనే విషయం పట్టించుకోలేదు గెలవడానికి ఎన్ని పరుగులు కావాలో అనే విషయమే ఆలోచించాను.

150కే పరిమితమైతే.. మ్యాచ్‌ గెలవలేమని

150కే పరిమితమైతే.. మ్యాచ్‌ గెలవలేమని

ఒకవేళ మేము 150పరుగులకే పరిమితమైతే.. మ్యాచ్‌ గెలవలేమని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే వాళ్ల జట్టులో పరుగుల వరద పారించగల ప్లేయర్లు ఉన్నారు.. ముఖ్యంగా సుజీ బేట్స్‌ లాంటి స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ ముందు ఆ లక్ష్యం చాలా చిన్నదైపోతుందని ఊహించాం. అందుకే ముందు నిలదొక్కుకొని తర్వాత నుంచి భారీ స్కోరు సాధించవచ్చని అనుకున్నాను.

Story first published: Saturday, November 10, 2018, 15:48 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X