న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: కరోనా ఎఫెక్ట్.. బంతికి లాలాజలంను రుద్దమంటున్న భువీ!!

Bhuvneshwar Kumar said Indian players might limit usage of saliva for shining ball
India vs South Africa 1st ODI: What Will Happen If Bowlers Don't Use Saliva To Shine Ball ?

ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌): టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. తొలివన్డే ఈ నెల 12న ధర్మశాలలో జరుగనుంది. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కలకత్తాలో జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు డే-నైట్‌ మ్యాచ్‌లే కావడం విశేషం. ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా టీ20 సిరీస్‌ను 5-0తో గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను 0-3, టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో రాణించి పూర్వపు ఫామ్‌ అందుకోవాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.

<strong>భారత్‌లోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా.. అతని సూచనకు కృతజ్ఞతలు: ఏబీ</strong>భారత్‌లోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా.. అతని సూచనకు కృతజ్ఞతలు: ఏబీ

ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న బౌలర్లు:

ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న బౌలర్లు:

కరోనా ఎఫెక్ట్‌ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ భారత దేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బౌలర్లు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేలో బంతిపై లాలాజలం (ఉమ్ము)ను ఎక్కువగా ఉపయోగించం అని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కాడానికి బౌలర్లు లాలాజలంను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.

అభిమానులు విమర్శలు చేస్తారు:

అభిమానులు విమర్శలు చేస్తారు:

మంగళవారం భువనేశ్వర్ మాట్లాడుతూ... 'మేము ఈ విషయం (లాలాజలం వాడాలా వద్దా)పై ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను లాలాజలం ఉపయోగించనని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లాలాజలం ఉపయోగించకపోతే బంతిని షైన్ చేయలేం. అలా చేయకపోతే మేము సరిగా రాణించలేం. అప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదని అభిమానులు మాపై విమర్శలు చేస్తారు' అని అన్నాడు.

తుది నిర్ణయం వారిదే:

తుది నిర్ణయం వారిదే:

'ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు టీమ్ మీటింగ్ ఉంది. అందులో ఈ విషయంపై చర్చిస్తాం. తుది నిర్ణయం మాత్రం జట్టు వైద్యుడు తీసుకుంటాడు. అతను మాకు ఏ సలహా ఇస్తాడో చూడాలి' అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధ్యమయినంతవరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నాడు. ఐపీఎల్‌కు కరోనా అంతరాయం కలిగిస్తుందా అని అడగ్గా.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అన్నాడు.

సన్నిహితంగా ఉండలేం:

సన్నిహితంగా ఉండలేం:

'జట్టు వైద్యుడు ఎప్పుడూ మాతోనే ఉంటున్నాడు. ఏం చేయాలో చేయొద్దో కొన్ని సూచనలు చేసాడు. పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం లాంటి సూచనలు చేసాడు. ఇక అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు, పూర్తి మద్దతు ఇస్తారు. అయితే వైరస్ కారణంగా వారితో సన్నిహితంగా ఉండలేం' అని భువీ తెలిపాడు.

Story first published: Wednesday, March 11, 2020, 16:03 [IST]
Other articles published on Mar 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X