న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాస్యాస్పదంగా రెండు రనౌట్లు ఒకేరోజు

Better than Azhar Ali? New Zealand pair presents their case for the most bizarre run out

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాపై టెస్టులో బంతి ఫోర్‌కి వెళ్లిందని భ్రమపడి పరుగు తీయకుండా పిచ్ మధ్యలో నిల్చొని పాక్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ గురువారం రనౌటై నవ్వులు పూయించగా.. తాజాగా శుక్రవారం కూడా మరో కామెడీ రనౌట్ నమోదైంది. న్యూజిలాండ్‌లోని దేశవాళీ క్రికెట్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు జారిపడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పరుగు కోసం రిప్పన్.. నాథన్ స్మిత్‌ని

పరుగు కోసం రిప్పన్.. నాథన్ స్మిత్‌ని

ఫ్లంకెట్ షీల్డ్‌ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఓటగో వాల్ట్స్ జట్టు బ్యాట్స్‌మెన్ నాథన్ స్మిత్, మైకెల్ రిప్పన్ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి వెల్లింగ్టన్‌ జట్టుని ఒత్తిడిలోకి నెడుతూ వచ్చారు. అయితే.. ఈ క్రమంలో లెగ్ సైడ్ దిశగా బంతిని నెట్టిన రిప్పన్ పరుగు కోసం నాథన్ స్మిత్‌ని పిలిచాడు. బంతి దూరంగా వెళ్లడంతో.. రెండో పరుగు కూడా సులభంగా వచ్చేలా కనిపించింది. కానీ.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వెళ్లి రిప్పన్.. రెండో పరుగు కోసం వెనక్కి వచ్చే ప్రయత్నంలో.. క్రీజుకి సమీపంలోనే కాలుజారి పడిపోయాడు.

వెనక్కి వెళ్లేందుకు ట్రై చేస్తూ కాలుజారి

వెనక్కి వెళ్లేందుకు ట్రై చేస్తూ కాలుజారి

అయితే.. కీపర్ ఎండ్‌వైపు వచ్చిన నాథన్ స్మిత్.. రిప్పన్ వైపు చూడకుండా.. కేవలం బంతివైపు చూస్తూ రెండో పరుగు కోసం దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. ఆ తర్వాత.. నాన్‌స్ట్రైకర్ వైపు చూస్తే.. అక్కడ రిప్పన్ పడి ఉండటంతో.. వెంటనే వెనక్కి వెళ్లిపోయేందుకు ట్రై చేస్తూ తానూ కాలుజారి పడిపోయాడు. బంతి అందుకున్న ప్రత్యర్థి వికెట్ కీపర్.. వికెట్లను గీరాటేయడంతో.. నాథన్ రనౌట్‌గా వెనుదిరగక తప్పలేదు.

 కచ్చితంగా బౌండరీకి వెళ్లిపోతుందిలే

కచ్చితంగా బౌండరీకి వెళ్లిపోతుందిలే

ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంతి బౌండరీ లైన్‌ను తాకిందని భ్రమపడిన అజహర్ అలీ (64: 141 బంతుల్లో 4ఫోర్లు) పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 53వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా అజహర్ హిట్ చేశాడు. బంతి వెళ్లిన వేగానికి అది కచ్చితంగా బౌండరీకి వెళ్లిపోతుందిలే అని భ్రమపడి.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌ నుంచి పరుగు కోసం వచ్చిన అసద్‌‌ని పిచ్‌ మధ్యలో ఆపి ముచ్చట్లు పెట్టాడు.

తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసి

తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసి

అయితే.. వేగంగా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్‌కి సమీపంలోనే ఆగిపోయింది. దీంతో.. అప్పటికే బంతి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లిన ఫీల్డర్ మిచెల్ స్టార్క్ వేగంగా దాన్ని అందుకుని వికెట్ కీపర్ టిమ్ పైనీకి అందించగా.. అతను వికెట్లను గీరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఏం జరిగిందో..? తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసిన అజహర్ అలీ.. ఆ తర్వాత థర్డ్ అంపైర్.. ఔటని ప్రకటించాడు. దీనిని అజహర్ క్రీడా స్ఫూర్తిగా తీసుకుని తన కొడుకు ఇది చూస్తే నవ్వుతాడంటూ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 20, 2018, 12:51 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X