న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్ షాట్‌కు ఫిజియో దవడ పగిలిందట..!

 Ben Stokes trial for affray begins at Bristol Crown Court

హైదరాబాద్: తాను పోతూ.. ఫిజియోను కూడా తీసుకెళ్లాడు బెన్ స్టోక్స్. ఇండియాతో టెస్టు సిరీస్‌లో తలపడుతోన్న ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టుకు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ దూరం కావాల్సి వచ్చింది. అయితే అతనితో పాటుగా ఆ జట్టు ఫిజియోను కూడా టెస్టుకు దూరమయ్యే పరిస్థితి తెచ్చాడు స్టోక్స్. బెన్‌ స్టోక్స్‌ బాదిన ఓ షాట్‌కు ఆ జట్టు ఫిజియో క్రెగ్‌ దేవెయ్‌మార్న్ ఔటయ్యాడు. ఔటవ్వడమంటే గాయపడ్డాడని.. బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు శనివారం ముగిసింది.

ఐతే, తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే ఎప్పటిలాగే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారట. ఆ సమయంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తోన్న స్టోక్స్‌ కొట్టిన ఓ షాట్‌ అక్కడే ఉన్న ఫిజియో మొహంపై బలంగా తగిలింది. దీంతో ఫిజియో క్రెగ్‌ నోట్లోంచి రక్తస్రావం అవుతుండటంతో వెంటనే అప్రమత్తమైన జట్టు మేనేజ్‌మెంట్‌ క్రెగ్‌ను ఆస్పత్రికి తరలించింది. ఎక్స్‌ రే నిర్వహించగా దవడలో ఎముకలు చిట్లినట్లు తేలిందట.
అతనికి శస్త్రచికిత్స చేయాల్సిందేనని వైద్యులు సూచించడంతో.. ఆ తంతును కానిచ్చారట. ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్లు జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాగే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఓ ఫొటోగ్రాఫర్‌ కంటిని బంతి బలంగా తాకింది. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్‌కు కూడా శస్త్రచికిత్స జరిగింది.

భారత్‌తో రెండో టెస్టుకు స్టోక్స్‌ దూరమయ్యాడు. గత ఏడాది బ్రిస్టల్‌లో ఓ క్లబ్‌ వద్ద ఒక వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడిగా ఉన్న స్టోక్స్‌ కోర్టు విచారణకు హాజరుకావాల్సి రావడంతో లార్డ్స్‌ టెస్టుకు అతడు దూరం కానున్నాడు. ఇప్పటికే పలు వాయిదాలకు హాజరైన స్టోక్స్‌పై కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుందేమో..!!

Story first published: Monday, August 6, 2018, 16:58 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X