న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలు కారణం ఇదీ: ఆసీస్ కెప్టెన్‌కు నిద్ర పట్టకుండా చేసిన బెన్ స్టోక్స్

Ben Stokes threat keeps Aussie skipper Tim Paine awake at night

హైదరాబాద్: హెడేంగ్లే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సెంచరీ బాది బుధవారానికి సరిగ్గా తొమ్మిది రోజులు. బెన్ స్టోక్స్ 135 నాటౌట్ మ్యాచ్ ఫలితాన్నే కాదు యాషెస్ సిరిస్ విజేతను కూడా మార్చివేసింది. అంతేనా స్టోక్స్ సెంచరీ ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌ను నిద్ర పట్టకుండా కూడా చేసిందంట.

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్ స్టోక్స్‌ను త్వరగా ఔట్ చేయడంలో టిమ్ పైన్ విఫలం కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో టిమ్ పైన్ మాట్లాడాడు.

కెప్టెన్సీ బాధ్యతల గురించి కాదు

కెప్టెన్సీ బాధ్యతల గురించి కాదు

"నో... నా కెప్టెన్సీ బాధ్యతల గురించి నేనేమీ భయపడలేదు. దాని వల్ల నా నిద్రకు ఎటువంటి భంగం కలగలేదు. కానీ, బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేయాలని ఆలోచించడంతో నాకు నిద్ర పట్టలేదు. అతనొక అద్భుతమైన ఆటగాడు. ఆ సమయంలో అతడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతడిని ఔట్‌ చేసేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వాటిని మేము మెరుగ్గా అమలుచేయాలి" అని అన్నాడు.

స్టోక్స్‌ను నాథన్‌ లయాన్‌ ఔట్ చేయగలడు

స్టోక్స్‌ను నాథన్‌ లయాన్‌ ఔట్ చేయగలడు

"బెన్ స్టోక్స్‌ను నాథన్‌ లయాన్‌ ఔట్ చేయగలడు. అతడికి బౌలింగ్ వేసిన ప్రతిసారీ ఎన్నో అవకాశాలను కల్పించాడు. మరొవైపు నాథన్ అతడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు మన అవకాశాలను కలిగి ఉన్నాం. మేము గనుక అలా చేయగలిగితే... మిడిల్ ఆర్డర్‌ను కట్టడి చేయడం సులభం అవుతుందని భావిస్తున్నాను. గతంలో కొన్ని పొరపాట్లు చేశాం. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాం" అని టిమ్ పైన్ తెలిపాడు.

బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టు

బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టు

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ బౌన్సర్‌కు గాయపడి మూడో టెస్టుకు దూరమైన స్టీవ్‌ స్మిత్‌ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

1-1తో సమం

1-1తో సమం

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక, ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్‌ను సమం అయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.

Story first published: Wednesday, September 4, 2019, 19:25 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X