న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనిప్పుడు వీధి రౌడీను కాదు: ఇంగ్లాండ్ ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్

ICC Cricket World Cup 2019 Final:Ben Stokes: World Cup Win Won’t Impede England’s Ashes Preparations
Ben Stokes says World Cup win wont impede Englands Ashes preparations

హైదరాబాద్: బెన్ స్టోక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో హీరో. అందుకు కారణం అతడు ఇంగ్లాండ్‌ తొలిసారి ప్రపంచకప్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు. కానీ, ఈ ప్రపంచకప్‌కు ముందు బెన్ స్టోక్స్ అంటే ప్రతి ఒక్కరికీ రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. మొదటిది 2016లో జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు సమర్పించుకుని మ్యాచ్‌ను చేజార్చిన సంఘటన.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

చరిత్ర పుటల్లో బెన్ స్టోక్స్

చరిత్ర పుటల్లో బెన్ స్టోక్స్

ఇక, రెండోది బ్రిస్టల్ నైట్ క్లబ్‌లో చిత్తుగా తాగి ఓ వ్యక్తితో గొడవపడిన వైనం. అయితే, ఇప్పుడు ఈ రెండింటినీ మరచిపోయే విధంగా తన పేరుని చరిత్ర పుట్లలో లిఖించాడు. "వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్‌ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందు ఉంటుంది" ఈ ప్రపంచకప్‌కు బెన్ స్టోక్స్ చెప్పిన మాటలివి.

తన మాటలను నిజం చేసి చూపించాడు

తన మాటలను నిజం చేసి చూపించాడు

చివరకు ఆ మాటలను బెన్ స్టోక్స్ నిజం చేసి చూపించాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పైనల్లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గతంలో తనపై వచ్చిన అపవాదులన్నింటినీ ఫైనల్ మ్యాచ్‌తో తొలగిపోయేలా చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్ మొత్తం ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.

ఫైనల్లో స్టోక్స్ చేసిన 84 పరుగులే

ఫైనల్లో స్టోక్స్ చేసిన 84 పరుగులే

ప్రపంచకప్ పైనల్లో న్యూజిలాండ్‌పై క్లిష్ట పరిస్థితుల్లో బెన్ స్టోక్స్ చేసిన 84 పరుగులు చరిత్రలో నిలిచిపోతాయి. మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "నాకు మాటలు రావడం లేదు. ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే

"న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్‌త్రో సిక్సర్‌ తర్వాత విలియమ్సన్‌కు నేను క్షమాపణ చెప్పాను. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాను" అని స్టోక్స్ భావోద్వేగంతో చెప్పాడు.

Story first published: Tuesday, July 16, 2019, 11:52 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X