న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Newzealand 3rd Test: టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా బెన్ స్టోక్స్,

Ben stokes Became First Test cricketer to have hit 100sixes, and have taken 100wickets

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్లో 100సిక్సర్లు కొట్టిన, 100వికెట్లు తీసిన తొలి టెస్టు క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడోది, మరియు చివరిదైన టెస్టు సందర్భంగా స్టార్ ఇంగ్లీష్ ఆల్-రౌండర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 13బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ 18పరుగుల్లోనే అతను సిక్స్ కొట్టడంతో టెస్ట్ క్రికెట్లో సిక్సర్ల సెంచరీని అందుకున్నాడు. ఇక 81 టెస్టుల్లో.. స్టోక్స్ ఇప్పటికే 32.67సగటుతో, 3.29ఎకానమీ రేటుతో 177వికెట్లు తీశాడు.

55పరుగులకే 6వికెట్లు కోల్పోయి..

55పరుగులకే 6వికెట్లు కోల్పోయి..

ఇక ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లాండ్ న్యూజిలాండ్ కంటే 65పరుగుల వెనుకంజలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 329పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ వ్యూహంతో ఆడారో అర్థం కాలేదు. హిట్టింగ్ ఎటాకింగ్ వ్యూహంతో ఆడాలని వారు ప్రయత్నించినట్లు స్పష్టమయింది. అయితే పేసర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి ఏడు ఓవర్లలోనే అలెక్స్ లీస్ (4), జాక్ క్రాలే (6), ఆలీ పోప్ (5)లను క్లీన్ బోల్డ్‌లుగా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 17పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్ జో రూట్ (5) కూడా పెద్దగా రాణించలేకపోయాడు. స్టోక్స్ (18), బెన్ ఫోక్స్ (0) డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఎటాకింగ్ వ్యూహంలో జానీ బెయిర్ స్టో సక్సెస్

ఎటాకింగ్ వ్యూహంలో జానీ బెయిర్ స్టో సక్సెస్

అయితే క్రీజులో ఎటాకింగ్ వ్యూహంతో సక్సెస్ అయిన జానీ బెయిర్‌స్టో మాత్రం న్యూజిలాండ్ బౌలర్లను ఆడుకున్నాడు. అతనికి తోడు అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జానీ ఓవర్టన్ సైతం క్రీజులో కుదురుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ ఇన్నింగ్స్‌పై పట్టు సాధించింది. బెయిర్‌స్టో రెండో టెస్ట్‌లో చెలరేగినట్లే మూడో టెస్ట్‌లోనూ చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన బెయిర్ స్టో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. ఇక టెస్టుల్లో తన పదో సెంచరీని బెయిర్ స్టో నమోదుచేశాడు. అలాగే టెస్ట్‌లలో 5,000పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 264/6తో నిలిచిన ఇంగ్లాండ్.. బెయిర్ స్టోతో పాటు మరో పక్క జేమీ ఓవర్టన్ (97పరుగులు 136బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) అనూహ్యంగా రాణించడంతో మూడో రోజు కూడా స్కోరు బోర్డు సజావుగా సాగింది.

సెంచరీకి మూడు పరుగుల దూరంలో...

సెంచరీకి మూడు పరుగుల దూరంలో...

సెంచరీకి మూడు పరుగుల దూరంలో బౌల్ట్ బౌలింగ్లో ఓవర్టన్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఒకానొక దశలో ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కివీస్ కంటే చాలా వెనుకబడినప్పటికీ.. ఇంగ్లాండ్ ప్రస్తుతం న్యూజిలాండ్ కంటే ముందంజ వేసింది. 62ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 7వికెట్లు కోల్పోయి 331పరుగులు చేసింది. తద్వారా 2పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక క్రీజులో జానీ బెయిర్ స్టో (161పరుగులు 152బంతుల్లో 24బంతుల్లో), స్టువర్ట్ బ్రాడ్ (27పరుగులు 21బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఆడుతున్నారు. వారి రెండవ రోజును మెరుగైన స్థితిలో ముగించడంలో సహాయపడింది. ఇంగ్లాండ్ బౌలర్టలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, సౌతీ 1 వికెట్ తీసుకున్నారు.

 అంతకుముందు న్యూజిలాండ్ 329పరుగులు చేసిందంటే

అంతకుముందు న్యూజిలాండ్ 329పరుగులు చేసిందంటే

..

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 329 పరుగులు చేయడానికి కారణం.. ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడమే. వారిద్దరు మరోసారి తమ సత్తా చాటడంతో కివీస్‌ ఓ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇకపోతే జాక్ లీచ్ తన స్పిన్ బౌలింగ్‌తో 5/100తో ఇంగ్లాండ్‌కు మంచి బ్రేక్స్ ఇచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ కూడా 3/62 ప్రదర్శనతో సత్తాచాటాడు.

Story first published: Saturday, June 25, 2022, 17:01 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X