న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూసఫ్ పఠాన్‌ను ఐదు నెలలు సస్పెండ్ చేసిన బీసీసీఐ

By Nageshwara Rao
BCCI suspends Yusuf Pathan for 5 months as he fails in dope test

హైదరాబాద్: డోప్‌ టెస్ట్‌లో విఫలం కావటంతో టీమిండియా బ్యాట్స్‌మన్‌ యూసఫ్‌ పఠాన్‌పై బీసీసీఐ 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఓ దేశీవాళి టీ20 మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో పఠాన్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది.

టర్‌బ్యూటలైన్‌(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్‌ తీసుకున్నాడు. దీంతో డోపింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ పఠాన్‌ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. దీంతో గతేడాది రంజీ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు.

తాజాగా పఠాన్‌ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టింది. నిజానికి ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పఠాన్‌ గానీ, జట్టు డాక్టర్‌ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు.

ఇదిలా ఉంటే గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా జనవరి 14తో ఆ సస్పెన్షన్‌ ముగియనుంది. దీంతో ఐపీఎల్ 2018లో పఠాన్ ఆడేందుకు మార్గం సుగమనం అయింది. ఇటీవలే ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో పఠాన్‌ను కోల్‌కతా ప్రాంఛైజీ వేలానికి వదిలేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 14:53 [IST]
Other articles published on Jan 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X