న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Finals: జంబో జట్టుతో ఇంగ్లండ్‌కు కోహ్లీసేన.. వచ్చే వారం తుది జట్టుపై నిర్ణయం!!

BCCI Selectors to select 22 member squad for ICC WTC Finals vs New Zealand
ICC WTC Finals : India's 22 Member Squad VS NZ & Tour Of England || Oneindia Telugu

ముంబై: ఐపీఎల్ 2021 కోసం క‌ఠిన‌మైన బ‌యో బబుల్ సృష్టించినా న‌లుగురు ప్లేయ‌ర్స్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌టం, త‌ర్వాత టోర్నీని వాయిదా వేయాల్సి రావ‌డం జ‌రిగిపోయాయి. అయితే ఇప్ప‌టికీ బ‌బుల్‌లోకి వైర‌స్ ఎలా వ‌చ్చింద‌న్న‌దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాధానం మాత్రం రాలేదు. ఇక ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24 మందితో టీమిండియాను ప్రకటించనుందని సమాచారం.

ఐపీఎల్‌ 2021ని ఆపేసి మంచి పని చేశారు.. మళ్లీ కలిసేవరకు దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి: స్టార్ ఓపెనర్ఐపీఎల్‌ 2021ని ఆపేసి మంచి పని చేశారు.. మళ్లీ కలిసేవరకు దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి: స్టార్ ఓపెనర్

ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ బోర్డుకు సెలక్టర్లు సమర్పించారట. దానిని బట్టే బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. వచ్చే వారం చివర్లో న్యూజిలాండ్‌తో తలపడబోయే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో ప్రస్తుతం భారత్‌ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో కోహ్లీసేనను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపించనుంది. వెళ్లగానే ఆటగాళ్లు బ్రిటన్‌లో పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు.

జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో కోహ్లీసేన తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ భారత్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక దాదాపుగా నెల రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఐదు టెస్టుల కోసం కోహ్లీసేన సన్నద్ధం కానుంది. మరోవైపు జూన్‌ 2న ఆరంభమయ్యే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ 20 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఇక కోహ్లీసేనతో తలపడే ప్రపంచ టెస్టు సిరీస్‌ ఫైనల్‌ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నారు.

సెప్టెంబర్ మాసంలో ఇంగ్లండ్ సిరీస్‌ ముగిశాక బహుశా అక్కడే ఐపీఎల్‌ 2021 రెండో దశ ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. అంతేకాకుండా లీగ్‌ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే అవకాశం సైతం ఉంది. ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఇంకో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. బహుశా నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. సీజన్‌ మలిదశ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ ఆలోచనలు చేస్తోంది.

Story first published: Thursday, May 6, 2021, 19:06 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X