న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రిటైర్‌ అవుతాడా? కొనసాగుతాడా?.. భవిష్యత్ ప్రణాళికలపై సెలెక్టర్లు ధోనీనే అడగాలి!!

Team India West Indies Tour 2019 : Selectors Need To Talk To MS Dhoni On His Retirement Says Kiran
BCCI Selectors need to talk MS Dhoni on his future plans feels former chief selector Kiran More

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భార‌త క్రికెట్‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌-2019 అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. రిటైర్మెంట్‌ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా: పాక్ క్రికెటర్ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా: పాక్ క్రికెటర్

వెస్టీండీస్ టూర్‌కు దూరం:

వెస్టీండీస్ టూర్‌కు దూరం:

ధోనీ రిటైర్మెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా మాకు ఏమీ చెప్పలేదు అని సెమీస్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే ఆగస్ట్‌లో వెస్టీండీస్ టూర్‌కు టీమిండియా వెళ్లనుంది. ఈ మ్యాచ్‌లకు ధోనీ గైర్హాజరవుతున్నట్లు బీసీసీఐ వర్గాల నుండి సమాచారం అందుతోంది. వికెట్ కీపర్‌గా ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకోనున్నారు.

 రిటైర్మెంట్‌పై చర్చ:

రిటైర్మెంట్‌పై చర్చ:

ఒకవేళ ధోనీ వెస్టిండీస్‌ వెళ్లినా జట్టులోని 15 మంది సభ్యుల్లో ఒకడిగా వెళుతారు. కానీ మైదానంలో ఆడే 11 మందిలో ఉండరు అని తెలుస్తోంది. ఇంతకు ధోనీ రిటైర్‌ అవుతాడా? ఆటలో కొనసాగుతాడా?.. కొనసాగితే ఎంతకాలం? జట్టులో ఉంటాడు. ఒక మార్గదర్శిగా కోహ్లీ సేనలో 15వ ఆటగాడిగా ఉంటాడా? అని చర్చ జరుగుతోంది. విండీస్ టూర్ నేపథ్యంలో సెలెక్టర్లు ధోనీని ప్రశ్నించే సాహసం చేయరు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్‌ సెలక్టర్లు స్పందించారు.

భవిష్యత్ ప్రణాళికలు ఏంటో తెలుసుకోవాలి:

భవిష్యత్ ప్రణాళికలు ఏంటో తెలుసుకోవాలి:

మాజీ చీఫ్‌ సెలక్టర్‌ కిరణ్‌ మోరే మాట్లాడుతూ... 'ప్రస్తుత జట్టు ప్రదర్శన ఎలా ఉందో సెలెక్టర్లకు తెలుసు. వచ్చే రెండుమూడేళ్లలో వారు జట్టులో కొనసాగాతారా లేదా అని అంచనా వేయాలి. బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేయాలి, వాటికి అవకాశాలు ఇవ్వాలి. ధోనీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటో అడిగి తెలుసుకోవాలి. జట్టులో కొనసాగుతాడో లేదో స్పష్టంగా అడగండి. ఏ విషయమైనా అతనితో మాట్లాడటం మంచిది' అని మోరె అన్నారు.

సెలక్టర్లకు ధైర్యం ఉండాలి:

సెలక్టర్లకు ధైర్యం ఉండాలి:

మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ మాట్లాడుతూ... 'ఆటగాళ్ల ప్రదర్శనలను సమీక్షించి మంచి జట్టును ఎంపిక చేయడమే సెలక్టర్ల పని. మెగా టోర్నీలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఆలోచించాలి. టెస్టు, వన్డే, టీ20 అన్ని ఫార్మాట్లలో ఏయే ఆటగాళ్లు సరిపోతారో కచ్చితంగా తెలుసుండాలి. ఆటగాళ్ల ఆటతీరు పరిశీలిస్తూ.. రిజర్వు బెంచి సామర్థ్యాన్ని గుర్తించాలి. భవిష్యత్తు కోసం సలహాలు తీసుకోవాలి. ఏం చేసినా సెలక్టర్లకు ధైర్యం ఉండాలి' అని వెంగీ పేర్కొన్నారు.

మాట్లాడితేనే క్లారిటీ:'

మాట్లాడితేనే క్లారిటీ:'

ఒకవేళ ధోనీ తన ఆటను కొనసాగిస్తే వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టులో కొనసాగాలి. ఆడకుండా జట్టులో ఉంటూ మార్గనిర్దేశకుడిగా ఉండలేడు. సెలక్టర్లు ధోనీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటో ప్రశ్నించాలి. అతనితో మాట్లాడితే ఏదైనా క్లారిటీ వస్తుంది' అని భారత మాజీలు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్ గంభీర్‌లు అభిప్రాయపడ్డారు. శుక్రవారం విండీస్‌ సిరీస్‌కు జట్టు ఎంపిక ఉంది. ఆ రోజు ధోనీ విషయంపై క్లారిటీ రానుంది.

Story first published: Thursday, July 18, 2019, 17:45 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X