న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sourav Ganguly: ఆ వాతావరణమే వేరు.. ఐపీఎల్ 2022పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌరవ్ గంగూలీ!!

BCCI president Sourav Ganguly Hopeful IPL 2022 Will Be Held In India

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 యూఏఈలో విజయవంతంగా ముగిసింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో కోల్‎కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను 27 పరుగుల తేడాతో చెన్నై సూప‌ర్‌ కింగ్స్ (సీఎస్‌కే) ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ముందుగా ఐపీఎల్ 2021 మ్యాచులు భారత్‌లోనే జరగ్గా.. పలు జట్లలో కరోనా కేసులు నమోదవ్వడంతో లీగ్ నిరవధిక వాయిదా పడింది. ఎన్నో చర్చల అనంతరం యూఏఈలో రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19న మొదలయ్యాయి.

ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా.. లీగ్ పూర్తయింది. మరో ఐదు నెలలో ఐపీఎల్ 2022 మొదలవనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌లోనే జరగవచ్చు

భారత్‌లోనే జరగవచ్చు

ఐపీఎల్‌ 2022 భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నానని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ భారత టోర్నీ అని, అభిమానులు కూడా ఈ లీగ్‌ స్వదేశంలో జరగాలని కోరుకుంటున్నారన్నాడు. గంగూలీ శనివారం ఓ ఆన్‌లైన్ షోలో పాల్గొనగా.. ఐపీఎల్‌ 2022 ఎక్కడ జరగాలని కోరుకుంటున్నారు అని అడగ్గా.. 'ఐపీఎల్ భారత్‌కు చెందిన టోర్నమెంట్.

మన దేశంలో టోర్నీ జరిగితే ఆ వాతావరణమే బిన్నంగా ఉంటుంది. మైదానాలు అభిమానులతో నిండిపోతాయి. ఆ సందడే వేరుగా ఉంటుంది. ఐపీఎల్ 2022కు ఇంకా సమయం ఉంది. అప్పటిలోగా దేశంలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావొచ్చు. వచ్చే సీజన్ భారత్‌లోనే జరగవచ్చు. ఇక్కడే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని సమాధానం ఇచ్చాడు.

 గొప్ప ప్రపంచకప్ అవుతుంది

గొప్ప ప్రపంచకప్ అవుతుంది

ఐపీఎల్ 2021 ద్వితీయార్థం ప్రకారం చూస్తే.. యూఏఈ మరియు ఒమన్ సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్ 2021లో కూడా తక్కువ స్కోరింగ్ నమోదవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'నేను అలా అనుకోను. బహుశా షార్జాలో వికెట్ల వల్ల తక్కువ స్కోర్ నమోదవవచ్చు. కానీ దుబాయ్ చాలా బెటర్. అక్కడ భారీ స్కోర్ మనం చూసాం. ఇది గొప్ప ప్రపంచకప్ అవుతుంది' అని దాదా అన్నాడు. ఈ రోజు టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం అవుతుంది. క్వాలిఫైయర్ మ్యాచులు ఈరోజు జరుగనున్నాయి. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం కానుండగా.. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

రెండు గ్రూపులుగా

రెండు గ్రూపులుగా

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా మరో రెండు క్వాలిఫైయర్ జట్లు ఉంటాయి.

సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక్కడ ప్రతీ జట్టు దాని గ్రూపులోని అన్ని జట్టుతో ఓ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచులు షార్జా, అబుదాబి, దుబాయ్‌లో జగరనున్నాయి. సూపర్ 12లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి.

Story first published: Sunday, October 17, 2021, 11:01 [IST]
Other articles published on Oct 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X