న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖేల్‌ రత్నకు రోహిత్ శర్మ‌.. అర్జునకు శిఖర్ ధావన్!!

BCCI nominates Rohit Sharma for Rajiv Gandhi Khel Ratna Award

ముంబై: ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కి టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్ రోహిత్ ‌శర్మను పేరును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రతిపాదించింది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు వీరి పేర్లను శనివారం బీసీసీఐ పంపించింది.

<strong>రాహుల్ ద్రవిడ్ క్రికెట్‌ కోసమే పుట్టాడు: రషీద్‌ లతీఫ్‌</strong>రాహుల్ ద్రవిడ్ క్రికెట్‌ కోసమే పుట్టాడు: రషీద్‌ లతీఫ్‌

 టీ20ల్లో నాలుగు సెంచరీలు:

టీ20ల్లో నాలుగు సెంచరీలు:

క్రీజులో నిలిస్తే విధ్వంసం సృష్టించే 'హిట్‌మ్యాన్‌' రోహిత్ ‌శర్మ 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్‌ ఘనత సొంతం చేసుకున్నాడు. అలాగే టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌ హిట్‌మ్యానే.

 అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీ:

అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీ:

అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీ చేసిన రికార్డు శిఖర్ ధావన్‌కు ఉంది. ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్‌ బ్యాట్‌ పురస్కారం అందుకున్న 'ఒకే ఒక్కడు' గబ్బర్‌. వన్డేల్లో అత్యంత వేగంగా 2000, 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 4000, 5000 పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్‌ సైతం అతడే కావడం విశేషం. 2018లో నామినేట్‌ అయినా.. అర్జున అవార్డు దక్కించుకోలేకపోయిన ధావన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

అత్యధిక వ్యక్తిగత పరుగులు:

అత్యధిక వ్యక్తిగత పరుగులు:

టెస్టుల్లో పేసర్‌ ఇషాంత్‌ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. అత్యంత పిన్న వయసులోనే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన క్రికెటర్‌గా ఇషాంత్‌ శర్మకు రికార్డు ఉంది. ఆసియా ఆవల అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌ లంబూనే. మహిళల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయ క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డు సృష్టించింది. తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో జట్టుకు అపురూప విజయాలు అందించింది.

నీరజ్‌ చోప్రా కూడా:

నీరజ్‌ చోప్రా కూడా:

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వరుసగా మూడో ఏడాది ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య నుంచి నీరజ్‌ పేరును మాత్రమే సిఫారసు చేసినట్లు సమాచారం. స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ను ఒడిశా ప్రభుత్వం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది.

Story first published: Sunday, May 31, 2020, 8:58 [IST]
Other articles published on May 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X