న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ బిగ్‌ప్లాన్.. దుబాయ్‌లోనే ఐపీఎల్‌, ట్రైనింగ్ క్యాంప్!

BCCI looking to fly Team India to Dubai for a 6-week training camp
Team India Expected To Fly Dubai For 6 Weeks - BCCI

ముంబై: భారత్‌లో క్రికెట్‌ను పున:ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. బిగ్ ప్లాన్ వేసింది. దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ను నిర్వహించేందుకు ఆ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

 ఆగస్ట్‌ నుంచి ట్రైనింగ్ క్యాంప్..

ఆగస్ట్‌ నుంచి ట్రైనింగ్ క్యాంప్..

అలాగే క్రికెటర్ల శిక్షణ శిబిరాన్ని కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఆగస్ట్‌‌‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ ట్రైనింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30, 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు.

సెప్టెంబర్‌లో ఐపీఎల్..

సెప్టెంబర్‌లో ఐపీఎల్..

ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్‌‌‌‌ 26 నుంచి నవంబర్‌‌‌‌ 8 వరకు ఐపీఎల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ ఉంది. ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే.. ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌‌‌‌ నుంచి నేరుగా అక్కడికి వెళ్లిపోతారు. మిగతా వారు భారత్‌కు తిరిగి వచ్చేస్తారు. అయితే బీసీసీఐ ప్లాన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావాలంటే ముందు టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వాయిదా లేదా రద్దు కావాలి. దీనిపై ఐసీసీ స్పష్టత ఇచ్చే దాకా ఐపీఎల్‌‌‌‌పై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకూడదు. ఒకవేళ చేస్తే అది రూల్స్‌‌‌‌ను అతిక్రమించడం అవుతుంది.

శుక్రవారం భేటీ..

శుక్రవారం భేటీ..

కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఫ్రాంచైజీలతో కూడా చర్చించలేదు. శుక్రవారం జరగబోయే కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఈ ప్లాన్‌‌‌‌పై చర్చ జరుగుతుందని సమాచారం. టీమిండియా భవిష్య పర్యటన ప్రణాళిక గురించి ప్రధానంగా చర్చించనున్నారు. వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టీ20 వరల్డ్కప్ రద్దు కావడం ఖాయం.. యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ జరగడం కూడా అంతే ఖాయంగా కనిపిస్తున్నది.

 ముంబైలో నిర్వహించాలనుకున్నా..

ముంబైలో నిర్వహించాలనుకున్నా..

నిజానికి ఐపీఎల్‌ను ముంబయిలో నిర్వహించాలన్నది బీసీసీఐ ఉద్దేశం. కానీ అక్కడ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రయాణాలు, రవాణా, లాజిస్టిక్స్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే దుబాయ్‌ అత్యుత్తమమని భావిస్తున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నా గత అనుభవాల దృష్ట్యా యూఏఈ వైపే మొగ్గు చూపుతున్నారు.

Story first published: Thursday, July 16, 2020, 12:26 [IST]
Other articles published on Jul 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X