న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా సబా కరీమ్

BCCI Appoints Saba Karim As General Manager, Cricket Operations

హైదరాబాద్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కొత్త జనరల్ మేనేజర్ పేరును ప్రకటించింది. సబ కరీమ్ అనే కొత్త జీఎమ్ 2018 జనవరి 1 నుంచి అధికారంలోకి వస్తారు. ఆయన చేసే కార్యకలాపాలు ముఖ్య కార్య నిర్వహణాధికారి అయిన రాహుల్ జోరీకి తెలియపరచాల్సి ఉంటుంది. క్రికెట్ జట్టుకు సంబంధించిన మరికొన్ని బాధ్యతలను సైతం జీఎమ్‌కు అప్పగించనున్నారు.

వాటిలో చేయనున్న మున్ముందు ఆపరేషన్‌లు, బడ్జెటింగ్, మ్యాచ్‌లు జరగాల్సిన వేదికల గురించి నిర్ణయాలు కీలకమైనవి. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ అయినటువంటి సబా కరీమ్ ఆట గురించి పూర్తిగా తెలిసిన వాడని పరిగణించి అతన్ని తీసుకున్నారు. కరీమ్‌కు 34 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవముంది. ఇతని పద్దెనిమిదేళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో మొత్తం 120 ఫస్ట్ క్లాస్ గేమ్స్, 124 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.

మాజీ క్రికెటర్ అయిన కరీమ్ 22 సెంచరీలు, 33హాఫ్ సెంచరీలతో కలిపి 7000పరుగులు చేశాడు. బీహార్, బెంగాల్ జట్టులతో కలిసి ఆడినప్పడు సాధించిన ఈ స్కోరుకు యావరేజ్ 56.66 గా ఉంది.

ఇంతటి అసమాన ప్రతిభను కల్గి ఉన్న కరీమ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆసియా కప్ లీగ్ తన కుడి కన్నుకు గాయమవడంతో ఆట మధ్యలో ఆపివేయాల్సి వచ్చింది. జీఎమ్‌గా అతన్ని తీసుకోకముందు అతను ఈస్ట్ జోన్ -2012కు సెలక్టరుగా పనిచేసేవారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 16:11 [IST]
Other articles published on Dec 23, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X