న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై చారిత్రక విజయం: సెలక్టర్లకు క్యాష్ రివార్డు ప్రకటించిన బోర్డు

BCCI announces cash rewards for the selectors after Team India’s successful Australia tour

హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీసేన విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను నెగ్గడంతో పాటు, వన్డే సిరిస్‌ను 2-1తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకముందు జరిగిన టీ20 సిరిస్‌ను సమం చేసింది.

<strong>తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది</strong>తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది

ఫలితంగా ఆసీస్ గడ్డపై ఏ ఫార్మాట్‌లోనూ సిరిస్‌ను కోల్పోని తొలి ఆసియా దేశంగా భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గిన నేపథ్యంలో ఆటగాళ్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది.

రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డు

రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డు

సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డుని అందజేస్తున్నట్టు బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ పాలకుల కమిటి ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సెలక్టర్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే

సెలక్టర్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే

జట్టు ఎంపికలో సెలక్టర్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే ఆసీస్ గడ్డపై భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. తొలి టెస్టుకు ముందే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. ఫామ్‌లో లేని రాహుల్, మురళీ విజయ్‌లను సెలెక్టర్లు ఆ తర్వాతి రెండు టెస్టులకు పక్కనబెట్టారు.

మూడో టెస్టులో ఓపెనర్లుగా మయాంక్, విహారి

మూడో టెస్టులో ఓపెనర్లుగా మయాంక్, విహారి

మూడో టెస్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా పంపి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు మూడో టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

చివరి టెస్టు డ్రాగా ముగియడంతో

చివరి టెస్టు డ్రాగా ముగియడంతో

సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో అప్పటికే టీమిండియా రెండు టెస్టులను నెగ్గడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని ఆసీస్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక, మూడు వన్డేల సిరిస్‌లో సెలెక్టర్లు ధోనీకి మద్దతుగా నిలిచారు.

ధోనిపై సెలక్టర్లు నమ్మకం

ధోనిపై సెలక్టర్లు నమ్మకం

గేతడాది పేలవ ప్రదర్శన చేసిన ధోనిపై సెలక్టర్లు నమ్మకం ఉంచి అతడికి తుది జట్టులో చోటు కల్పించారు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టిన ధోని.. ఆసీస్ గడ్డ మీద టీమిండియా తొలి ద్వైపాక్షిక సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, January 22, 2019, 18:41 [IST]
Other articles published on Jan 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X