
తొలి టీ20కి జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఈ నేపథ్యంలో తొలి టీ20లో తలపడే తుది జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను మిడిలార్డర్‌కు తీసుకున్నారు.

ధోని స్థానంలో వికెట్ కీపర్‌గా పంత్
టీ20ల నుంచి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినివ్వడంతో రిషబ్ పంత్‌కు వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. మరోవైపు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ, మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చాడు. భారత జట్టులో చోటు చేసుకున్న ఒకే ఒక్క మార్పు ఇదే.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్
తొలి టీ20లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు. కోహ్లీ మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు రానున్నారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించిన కృనాల్ పాండ్యా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
|
ఆసీస్‌తో తొలి టీ20లో తలపడే భారత జట్టిదే:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యుజువేంద్ర చాహల్.