న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకేరోజు రెండు హ్యాట్రిక్‌లు: బిగ్‌బాష్ లీగ్‌ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)

BBL: After Rashid Khan, Pakistan pacer Haris Rauf claims 2nd hat-trick of the day

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తర్వాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్‌ల్లో బిగ్‌బాష్ లీగ్ ఒకటి. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ బిగ్‌బాష్ లీగ్‌లో ఒకేరోజు రెండు అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతం ఏంటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు.

అడిలైడ్ వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొలుత హ్యాట్రిక్ సాధించగా.... ఆ తర్వాత మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ బౌలర్ హరిస్ రూఫ్ హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా బిగ్‌బాష్ లీగ్‌లో ఒకరోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.

<strong>క్రీజులో పాతుకుపోయిన ఫిలాండర్‌.. అశ్లీల పదజాలం ప్రయోగించిన బట్లర్‌ (వీడియో)!!</strong>క్రీజులో పాతుకుపోయిన ఫిలాండర్‌.. అశ్లీల పదజాలం ప్రయోగించిన బట్లర్‌ (వీడియో)!!

ఇదే మొదటిసారి

బీగ్‌‍బాష్ లీగ్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో హరిస్ రౌఫ్ ఈ ఘనత సాధించాడు. సిడ్నీ థండర్స్‌ జట్టుకు చెందిన ఆటగాళ్లు మాథ్యూ గిల్కేస్, కల్లమ్ ఫెర్గూసన్, డేనియల్ సామ్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.

అద్భుతమైన ఫామ్‌లో హరిస్ రౌఫ్

అద్భుతమైన ఫామ్‌లో హరిస్ రౌఫ్

పాకిస్థాన్‌కు చెందిన పేసర్ హరిస్ రౌఫ్ ప్రస్తుత బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ప్రారంభంలో హరిస్ రౌఫ్ చేసుకున్న సంబరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

గొంతు కోసే సంబరాలపై ఆసీస్ మాజీ రగ్బీ ఆటగాడు అసంతృప్తి

గొంతు కోసే సంబరాలపై ఆసీస్ మాజీ రగ్బీ ఆటగాడు అసంతృప్తి

వికెట్ తీసిన సమయంలో హరిస్ రౌఫ్ గొంతు కోసేలా సంబరాలు జరుపుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా మాజీ రగ్బీ ఆటగాడు డారిల్ బ్రోహ్మాన్ కూడా రౌఫ్ సంబరాల శైలిపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, అంతకముందు సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే.

సిడ్నీ సిక్సర్స్‌పై రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో జేమ్స్ విన్సీ(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్... ఆ తర్వాత 12వ ఓవర్ తొలి బంతికి హ్యాట్రిక్ తీయడం విశేషం. ఆ తర్వాత డానియేల్ హ్యూస్ వికెట్ తీయడంతో ఈ మ్యాచ్‌లో రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, January 8, 2020, 16:51 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X