న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంఫైర్ తప్పిదం: ఏడో బంతికి బ్యాట్స్‌మన్ ఔట్‌ కావడంతో వివాదం

BBL 2019: Batsman gets out on 7th ball of an over after bizarre umpiring error

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఓ బ్యాట్స్‌మన్‌ ఔటైన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. క్రికెట్ రూల్స్ ప్రకారం ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అయితే, అంపైర్‌ ఏడో బాల్‌ వేయించడంతో పాటు ఆ బంతికి బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కావడం వివాదానికి దారి తీసింది.

ఏఎఫ్‌సీ ఆసియాకప్‌: గెలిస్తే నేరుగా నాకౌట్‌కు, భుటియా రికార్డు సమంఏఎఫ్‌సీ ఆసియాకప్‌: గెలిస్తే నేరుగా నాకౌట్‌కు, భుటియా రికార్డు సమం

వివరాల్లోకి వెళితే... బీబీఎల్‌లో భాగంగా ఆదివారం పెర్త్‌ స్కార్చర్స్‌-సిడ్నీ సిక్సర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే, రెండో ఓవర్‌లో ఓపెనర్‌ మైకేల్‌ క్లింగర్‌ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్‌కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్‌ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు.

అదే బంతికి మైకేల్‌ క్లింగర్‌ ఔట్

అదే బంతికి మైకేల్‌ క్లింగర్‌ ఔట్

అదే బంతికి మైకేల్‌ క్లింగర్‌ ఔట్ కావడం వివాదాస్పదమైంది. సిడ్నీ సిక్సర్‌ బౌలర్ డ్వార్‌షూయిస్‌ వేసిన ఓవర్‌ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్‌ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్‌ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించాడు. ఇక, నాలుగో బంతికి క్లింగర్ ఒక పరుగు తీశాడు.

7 వికెట్ల తేడాతో విజయం

7 వికెట్ల తేడాతో విజయం

ఐదో బంతికి బెన్‌ క్రాఫ్‌ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్‌ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్‌ వేయించడంతో క్లింగర్‌ ఔటయ్యాడు. ఫీల్డ్‌ అంపైర్‌ చేసిన తప్పిదాన్ని మ్యాచ్‌ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

 87 పరుగులు చేసిన బాన్‌క్రాఫ్ట్‌

87 పరుగులు చేసిన బాన్‌క్రాఫ్ట్‌

కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్‌ స్కార్చర్స్‌ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గతేడాది సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్‌క్రాప్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తొమ్మిది నెలలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, January 14, 2019, 15:22 [IST]
Other articles published on Jan 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X