న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా క్రికెటర్ల సమ్మె: ప్రధాని హసీనా జోక్యం.. మధ్యవర్తిగా కెప్టెన్ మొర్తజా!!

Bangladesh vs India: Mashrafe Mortaza likely to mediate between players and BCB

ఢాకా: సోమవారం నుండి బంగ్లా ఆటగాళ్లు దాదాపు 50 మంది బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ)పై జీతభత్యాల విషయంలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడంతో భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌పై సందిగ్ధం ఏర్పడింది. అయితే బోర్డు, ఆటగాళ్ల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ప్రత్యేక దృష్టి సారించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజాను మధ్యవర్తిగా పంపించినట్టు సమాచారం తెలుస్తోంది.

<strong>కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లా ప్రధాని మాటిచ్చారు.. ప్రధాని వచ్చాక జట్టెందుకు రాదు: గంగూలీ</strong>కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లా ప్రధాని మాటిచ్చారు.. ప్రధాని వచ్చాక జట్టెందుకు రాదు: గంగూలీ

ప్రధాని జోక్యం

ప్రధాని జోక్యం

క్రికెట్‌ సంక్షోభం గురించి మొర్తజాతో ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడారని బీసీబీ డైరెక్టర్‌ మహబూబుల్‌ ఆనమ్‌ తెలిపారు. 'ప్రధాని షేక్‌ హసీనా క్రికెట్‌ వివాద తాజా పరిణామాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆటగాళ్లను మళ్లీ మైదానంలోకి వెళ్లాలని చెప్పాల్సిందిగా మష్రఫెను ఆదేశించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి' అని ఆనమ్‌ పేర్కొన్నారు.

ఆటగాళ్ల మధ్య చర్చలు

ఆటగాళ్ల మధ్య చర్చలు

'ఆటగాళ్లు అందరూ చర్చించుకొని మమ్మల్ని కలుస్తామని ఓ సీనియర్‌ ఆటగాడు నిన్న సాయంత్రం సమాచారం ఇచ్చాడు. బహుశా బుధవారం సాయంత్రం వారు కలుస్తుండొచ్చు. ఆటగాళ్ళు బోర్డు అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది' అని బీసీబీ సీఈవో నిజాముద్దీన్‌ చౌదరీ వెల్లడించారు. ప్రధాని జోక్యంతో వివాదం త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉంది.

బంగ్లా ప్రధాని వస్తారు

బంగ్లా ప్రధాని వస్తారు

'జీతాల విషయంలో బంగ్లా ఆటగాళ్ల, బోర్డు మధ్య జరుగుతున్న వివాదం అంతర్గత విషయం. కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లాదేశ్‌ ప్రధాని మాటిచ్చారు. బంగ్లా ప్రధాని వచ్చాక.. వారి జాతీయ జట్టు ఎందుకు రాదో చూద్దాం' అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గంగూలీ అన్నారు. నవంబర్‌ 3 నుంచి బంగ్లాదేశ్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా 3 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్‌ 3న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్‌తో పర్యటన ఆరంభమవుతుంది.

ప్రధానులకు క్యాబ్‌ ఆహ్వానం

ప్రధానులకు క్యాబ్‌ ఆహ్వానం

భారత్‌-బంగ్లాదేశ్‌ల జట్ల మధ్య నవంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత, బంగ్లా ప్రధానులకు క్యాబ్‌ నుండి ఆహ్వానం అందింది.

Story first published: Thursday, October 24, 2019, 10:43 [IST]
Other articles published on Oct 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X