న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా స్పిన్నర్‌కు బ్రెయిన్ ట్యూమర్‌, అండగా నిలిచిన బోర్డు

Bangladesh spinner Mosharraf Hossain Rubel diagnosed with a brain tumor

హైదరాబాద్: బంగ్లాదేశ్ స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్నాడు. దీనికి చికిత్స తీసుకోవడం కోసం త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆరోగ్యం బాగోలేదని ఢాకాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ముషారఫ్ హుస్సేన్‌కు.. అక్కడి వైద్యులు బ్రెయిన్‌ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు.

ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!

సింగపూర్ వెళ్లి సర్జరీ

సింగపూర్ వెళ్లి సర్జరీ

ఇది ప్రారంభ దశలోనే ఉందని సింగపూర్ వెళ్లి సర్జరీ చేయించుకోవచ్చని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో అతడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముషారఫ్ హుస్సేన్‌ సర్జరీకి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు అంచనా వేశారు. దీనిపై ముషారఫ్ హుస్సేన్‌ ఇటీవలే మీడియాతో మాట్లాడాడు.

ఆందోళనకు గురయ్యాం

ఆందోళనకు గురయ్యాం

"నాకు ట్యూమర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను, నా కుటుంబం చాలా ఆందోళనకు గురయ్యాం. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలియగానే మాకు కొంత ఉపశమనం కలిగింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పాను. అందరూ నన్ను ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. నేను కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను" అని చెప్పాడు.

నాకు సర్జరీ అవసరం

నాకు సర్జరీ అవసరం

"నాకు సర్జరీ అవసరం. దీని కోసం సింగపూర్ వెళ్తున్నాను. ప్రస్తుతం వీసాకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే సింగపూర్ వెళ్తాను" అని ముషారఫ్ తెలిపాడు. ముషారఫ్ బంగ్లాదేశ్ జట్టు తరపున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. మొత్తంగా 25 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

2008 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హుస్సేన్‌

2008 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హుస్సేన్‌

2008 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హుస్సేన్‌.. ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2016లో చివరి వన్డే ఆడాడు. 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 3000కు పైగా పరుగులు చేయడంతో పాటు, 392 వికెట్లను పడగొట్టాడు.

Story first published: Wednesday, March 13, 2019, 9:39 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X