న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా ప్రభావం.. క్రికెట్‌లో సరికొత్త సెల‌బ్రేష‌న్స్ చూసారా? (వీడియో)!!

Bangladesh’s Mahmudullah uses elbow to celebrate after taking wicket in a DPL game

ఢాకా: క్రికెట్‌ ఆటలో సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లతో పాటు ఆటగాళ్లు చేసే వినూత్న సెలబ్రేషన్స్‌ కూడా అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వికెట్ తీసిన ఆనందంలో విండీస్ పేసర్ షెల్డన్‌ కాట్రెల్‌ సెల్యూట్‌ చేయడం, ప్రొటీస్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ మైదానంలో పరుగెత్తడం, విండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రేవో డాన్స్ చేయడం.. క్యాచ్ పట్టగానే శిఖర్‌ ధావన్‌ తొడగొట్టడం, క్రిస్ గేల్ స్టెప్పులు వేయడం లాంటివి మనం చూసే ఉంటాం. తాజాగా బంగ్లాదేశ్ యువ ఆటగాడు మ‌హ్ముదుల్లా సరికొత్త సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సెలబ్రేషన్స్‌ అంతటికి కారణం మహమ్మారి కరోనా (కొవిడ్-19) వైరస్.

<strong>జట్టులో చోటెక్కడుంది.. ధోనీ పునరాగమనం చేయడం ఇక కష్టమే: సెహ్వాగ్</strong>జట్టులో చోటెక్కడుంది.. ధోనీ పునరాగమనం చేయడం ఇక కష్టమే: సెహ్వాగ్

సరికొత్త సెల‌బ్రేష‌న్స్:

కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది మృతి చెందగా.. లక్షా 75 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో క్రీడాలోకం మొత్తం అతలాకుతలం అవుతుంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు వాయిదా లేదా రద్దవుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా బీసీసీఐ వాయిదా వేసింది. అయితే పొరుగునే ఉన్న బంగ్లాలోని ఢాకాలో డివిజన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మాత్రం జరుగుతున్నాయి. ఆటగాళ్లు వైరస్ ప్ర‌భావాన్ని అడ్డుకోవడానికి కొన్ని జాగ్ర‌త్తలు తీసుకోవ‌డంతో.. సరికొత్త సెల‌బ్రేష‌న్స్ క్రికెట్ ఆటకు పరిచమయ్యాయి.

మోచేతితో చీర్స్:

మోచేతితో చీర్స్:

లీగ్‌లో భాగంగా ప్రైమ్‌బ్యాంక్‌సీసీ- గాజీ గ్రూప్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రోనీ తాలుక్‌దార్‌ను స్పిన్నర్ మ‌హ్ముదుల్లా క్లీన్ బోల్డ్ చేసాడు. కరోనా ప్రభావంతో వికెట్ తీసిన మ‌హ్ముదుల్లాను జట్టు సభ్యులు అందరూ మోచేతితో చీర్స్ చెబుతూ అభినందించారు. ఒక్కరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. సాధార‌ణంగా వికెట్ ప‌డిన‌ప్పుడు ఆట‌గాళ్లు ఒక‌రినొక‌రు చేతుల‌తో హైఫై కొట్టుకుంటారు, కానీ కరోనా ప్రభావంతో జాగ్ర‌త్తలు తీసుకున్న ఆటగాళ్లు ఇలా సరికొత్త సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నారు.

 ఇదంతా కరోనా ప్రభావమే:

ఇదంతా కరోనా ప్రభావమే:

ఈ నూతన సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'కరోనా ఎంత పని చేసింది' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఇదంతా కరోనా ప్రభావమే' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. ఈ మ్యాచులో తాలుక్‌దార్‌ 79 పరుగులు చేసాడు. అయితే ముగ్గురిని రనౌట్ చేసాడు. ప్రైమ్‌బ్యాంక్‌సీసీ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం గాజీ గ్రూప్ 9 వికెట్లకు 242 పరుగులు చేసింది. మెహదీ హసన్, సౌమ్య సర్కార్ రాణించినా ఫలితం లేకుండా పోయింది.

Story first published: Wednesday, March 18, 2020, 15:44 [IST]
Other articles published on Mar 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X