బాల్ టాంపరింగ్ ఘటన క్రికెట్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరినీ బాధించింది

Posted By:
Ball-Tampering Scandal: VVS Laxman Says One Should Never Cheat And Cross The Line

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు హద్దులు దాటారని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్‌ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ వివాదాన్ని ఐసీసీ తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది జరుగనున్న ఐపీఎల్‌లోనూ స్మిత్‌, వార్నర్‌ పాల్గొనడం లేదని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది.

బాధపడ్డాం.. కోపంగా కూడా ఉన్నాం: బాల్ టాంపరింగ్ వివాదంపై వార్న్

క్రికెట్ ఆస్ట్రేలియా చర్యల అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ 'మేమంతా క్రికెటర్లుగా గుర్తుంచుకోవాల్సిన విషయం మాలో పోటీతత్వం ఉండాలి. కానీ ఎలాగైనా విజయం సాధించాలన్న తలంపుతో ఎప్పుడూ మోసం చేయకూడదు. హద్దు దాటకూడదు. దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియా జట్టు హద్దుమీరి ప్రవర్తించింది. కేవలం ఆస్ట్రేలియన్లనే కాదు యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఈ ఘటన బాధించింది.' అని అన్నాడు.

గతేడాది దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న డుప్లెసిస్ వివాదాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తు చేశాడు. అప్పటి పర్యటనలో డుప్లెసిస్ బంతిని మెరిసేలా చేసేందుకు మింట్‌ ఉపయోగిస్తూ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.

అప్పడు ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా డుప్లెసిస్ చేసింది నైతికత కాదని చెప్పారని, ఇప్పుడు అదే ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ వివాదంలో భాగస్వాములయ్యారని లక్ష్మణ్ చెప్పాడు. అప్పట్లో ప్రతి ఒక్కరూ ఈ వివాదంపై దృష్టిపెట్టారని.. ఎందుకంటే అది జరిగింది ఆస్ట్రేలియాలో కాబట్టి అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం కేప్‌టౌన్‌లో జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్‌పై అభిమానులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని లక్ష్మణ్ అన్నాడు. తాను ఆస్ట్రేలియాతో ఎన్నో మ్యాచ్‌లు ఆడానని... వారు ఆకుపచ్చని టోపీ ధరించడాన్ని ఎంత గౌరవంగా భావిస్తారో తనకు తెలుసునని లక్ష్మణ్ చెప్పాడు.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం మోసపూరితమైన చర్య కాబట్టి వారు ఈ ఘటనకు ఎంతగా నొచ్చుకుని ఉంటారో తాను ఊహించగలనని అన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్‌ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది.

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌‌లపై ఏడాది నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా

దీంతో పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై ఈ ముగ్గురు ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు తమ విచారణలో తేలినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 8:32 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి