న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ బంతిని తీసుకో... లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో: ధోని ఛలోక్తి

Ball lelo nahi to bolega retirement le rahe hain: MS Dhoni tells Sanjay Bangar after taking match ball - Watch

హైదరాబాద్: గతేడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన ధోని.. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారంతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తెలివైన క్రికెటర్‌, ధోని అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే: కోహ్లీతెలివైన క్రికెటర్‌, ధోని అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే: కోహ్లీ

దీంతో గత కొంతకాలంగా తనపై వస్తోన్న విమర్శల నోళ్లు మూయించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత ధోని మ్యాచ్ బాల్‌ను తనతో తీసుకొచ్చాడు. తన చేతిలో ఉన్న బంతిని బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌కు ఇస్తూ 'నా దగ్గరి నుంచి బంతి తీసేసుకో. లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో' అని నవ్వుతూ చెప్పడం టీవీలో రికార్డయింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది ఇంగ్లాండ్‌తో వన్డే ముగిశాక కూడా ధోని మ్యాచ్ బాల్‌ను తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ధోని క్రికెట్‌ నుంచి ధోని రిటైర్‌ అవుతున్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను ధోని ఖండించాడు. బంతి ఏ కండీషన్‌లో ఉందో బౌలింగ్ కోచ్‌కు చూపించడానికి తీసుకొచ్చానని ఆ తర్వాత ధోని చెప్పిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 19, 2019, 15:23 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X