న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC T20I Rankings: కోహ్లీ రికార్డును తుడిచిపెట్టిన బాబర్ ఆజం.. టీ20ల్లో అరుదైన ఘనత

Babar Azam Has set a Record of Holding longest time No.1 Rank in T20Is, And He surpasses kohli

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఎదురు లేకుండా పోయింది. ఐసీసీ పురుషుల టీ20I ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగిన బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డు నెలకొల్పాడు. నంబర్ 1 ర్యాంకులో బాబర్ ఆజం 1000రోజుల కంటే ఎక్కువ కాలం పాటు ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 1013రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగగా.. అతని రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. బాబర్ అజామ్ 818రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 794రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం 21వ స్థానానికి పడిపోయాడు. ఇటీవల కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. గత 3ఏళ్లుగా టీ20 ఫార్మాట్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో 300పరుగులకు మించి కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇటీవల 6వ స్థానానికి చేరుకున్న ఇషాన్ కిషన్.. ఒక స్థానం కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు. ఇషాన్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో మంచిగా రాణించాడు. కానీ ఐర్లాండ్‌తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం తన ఫామ్‌ చూపించలేకపోయాడు.

ఇక పురుషుల టీ20ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఆల్ రౌండర్ మూడు విభాగాల్లో టాప్ 10లో ఉన్న ఏకైక ఇండియన్ ప్లేయర్ ఇషాన్ మాత్రమే. ఇక కేఎల్ రాహుల్ బ్యాటర్ల లిస్టులో 17వ స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐర్లాండ్ యువ సంచలనం హ్యారీ టెక్టర్ ఇటీవల ఇండియాతో టీ20 సిరీస్లో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అతను 55స్థానాలు ఎగబాకి 66వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐర్లాండ్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన దీపక్ హుడా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకుకు చేరుకున్నాడు.

Story first published: Wednesday, June 29, 2022, 15:06 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X