న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ క్రికెటర్‌ అలీసా హీలీ మెరుపులు.. టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు

AUSW vs SLW: Alyssa Healy Smashes Highest T20I Score In Womens Cricket

సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలీసా హేలీ అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో రికార్డులను తిరగరాసింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా అలిస్సా హీలీ ప్రపంచ రికార్డు సృష్టించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో హీలీ 148 పరుగులు చేసి రికార్డుల్లోకి ఎక్కింది.

<strong>పీకేఎల్ చరిత్రలో పవన్‌ షెరావత్ రికార్డు.. ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు</strong>పీకేఎల్ చరిత్రలో పవన్‌ షెరావత్ రికార్డు.. ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు

అత్యధిక వ్యక్తిగత స్కోరు:

అత్యధిక వ్యక్తిగత స్కోరు:

శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడవ టీ20లో అలిస్సా హీలీ 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 148 పరుగులలో 118 బౌండరీల ద్వారా వచ్చినవే ఉన్నాయి. అంతకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ (133 నాటౌట్‌) అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసింది. తాజాగా హేలీ ఆ రికార్డును బద్దలు కొట్టింది.

రెండో వేగవంతమైన సెంచరీ:

అలీసా హీలీ మహిళల టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని కూడా నమోదు చేసింది. 46 బంతుల్లోనే హీలీ సెంచరీ మార్క్‌ చేరుకుంది. అంతేకాదు టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఆసీస్ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇంతకుముందు హీలీ అత్యధిక స్కోర్ 90. ఈ స్కోర్ 2012లో భారత్‌పై సాధించింది. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ హీలీ మేనకోడలు అలీసా హేలీ.

 హేలీ మెరుపులు:

హేలీ మెరుపులు:

అలీసా హేలీ మెరుపులతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో రెండు వికెట్లకు 226 పరుగులు చేసింది. అలీసా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. రాచెల్ హేన్స్ 41 పరుగులు చేసింది. చమరీ ఆటపట్టు రెండు వికెట్లు తీసింది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు చేయడంతో.. ఆసీస్ 132 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. చమరీ ఆటపట్టు (31) టాప్ స్కోరర్. నికోలా కారీ మూడు వికెట్లు తీసింది.

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌:

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌:

ఈ విజయంతో ఆస్ట్రేలియా మహిళలు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళలు 41 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. మొదటి వన్డే శనివారం బ్రిస్బేన్‌లో జరగనుంది.

ఆటపట్టు అరుదైన రికార్డు:

ఆటపట్టు అరుదైన రికార్డు:

ఈ సిరీస్‌లోనే శ్రీలంక టీ20 కెప్టెన్ చమరీ ఆటపట్టు అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. టీ20ల్లో సెంచరీ (66 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులు) సాధించిన తొలి శ్రీలంక మహిళ క్రికెటర్‌గా చమరీ ఆటపట్టు అరుదైన ఘనతను సాధించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చమరీ ఈ రికార్డు సాధించింది. వన్డే, టీ20లలో సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా కూడా ఆటపట్టు నిలిచింది.

Story first published: Thursday, October 3, 2019, 8:56 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X