న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని అవుట్ చేసి సంబరాలు చేసుకున్న ఆసీస్ టీనేజర్(వీడియో)

Australian Teenager Who Has Never Played First-Class Cricket Stuns Virat Kohli

హైదరాబాద్: సిడ్నీ: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వస్తుందంటే ఆసీస్ ఆటగాళ్లంతా కోహ్లీ కోసమే ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. టెస్టుల్లో గెలవాలనే కసితో సిద్ధమైన టీమిండియా గట్టిపోటీ ఇవ్వాలని కంగారూ జట్టు ఎదురుచూస్తోంది. ఇప్పటికే తొలి ఫార్మాట్ ముగియడంతో అసలైన టెస్టు సిరీస్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. భారత జట్టులో కోహ్లీనే టార్గెట్ పోరాడాల్సిన ఆసీస్ అందుకోసం అదే దూకుడుతో ఆడే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు బౌలింగ్ వేసి శిక్షణ తీసుకుంది.

వార్మప్ మ్యాచ్‌లో అవుట్ చేసిన ఆరోన్ హార్డీ

అటువంటి కోహ్లీని వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్ టీనేజర్ ఆరోన్ హార్డీ అవుట్ చేశాడు. ఆ బాల్‌ను అటెంప్ట్ చేసిన కోహ్లీ కొద్ది సెకన్ల పాటు ఆశ్చర్యానికి గురైయ్యాడు. బాల్‌ను తానే వేసి క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ 64 పరుగులతో సరిపెట్టుకుని పెవిలియన్ చేరుకున్నాడు. అంతటి ప్రధాన వికెట్‌ను పడగొట్టినందుకు హార్డీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఆరోన్ హార్డీని ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడించొచ్చంటూ

ఈ విజయానికి ఇరు దేశాల నుంచి ఆ టీనేజర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఆరోన్ హార్డీని ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడించొచ్చంటూ కితాబిస్తున్నారు. హార్డీ టీమిండియా బ్యాట్స్‌మెన్(రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) నాలుగు వికెట్లు తీశాడు.

భారత్ టాపార్డర్ పరుగుల మోత

నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు. డిసెంబర్ 6 అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు షా కోలుకుంటే తొలి టెస్టు ఆడే అవకాశముంది. ఇప్పటికే ఈ పర్యటనలో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది.

Story first published: Friday, November 30, 2018, 13:34 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X