న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో భారత బౌలర్లు సఫలం'

Australian batsmen were needlessly aggressive against patient Indian attack: Simon Katich

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బౌలర్లు సహనంతో బౌలింగ్ చేసి, ఆతిథ్య జట్టు స్కోరు బోర్డుపై ఒత్తిడి పెంచారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఏది గొప్ప?: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ Vs 2011 వరల్డ్‌కప్ విజయంఏది గొప్ప?: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ Vs 2011 వరల్డ్‌కప్ విజయం

ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఓపికతో క్రీజులో నిలవలేకపోయారని విమర్శించిన సైమన్ కటిచ్.. వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో భారత్ బౌలర్లు సఫలీకృతమయ్యారని చెప్పుకొచ్చాడు. తాజాగా కటిచ్ పీటీఐకి ఇంటర్యూ ఇచ్చాడు.

భారత్ బౌలర్లు అద్భుతం

భారత్ బౌలర్లు అద్భుతం

"ఆస్ట్రేలియా గడ్డపై గతంలో భారత్ బౌలర్లు ఎవరూ ఈ తరహాలో టెస్టుల్లో రాణించలేదు. ముఖ్యంగా భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. పిచ్ నుంచి పేస్ రాబడుతూనే, బంతిని రెండు వైపులా స్వింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో కూడా నిలవలేకపోయారు" అని అన్నాడు.

వికెట్లు పడుతున్నా

వికెట్లు పడుతున్నా

"ఇంకా చెప్పాలంటే వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు తప్ప.. ఓపికగా క్రీజులో నిలవాలనే ఆలోచనే వారికి లేకపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా సొంతగడ్డపై తేలిపోయారు" అని కటిచ్ వెల్లడించాడు. ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్ మొత్తం ఐదు సెంచరీలు నమోదు చేశారు.

ఆసీస్ నుంచి ఒక్క సెంచరీ కూడా లేదు

ఆసీస్ నుంచి ఒక్క సెంచరీ కూడా లేదు

మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సెంచరీ సాధించలేకపోయాడు. సిరీస్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా సమిష్టి ప్రదర్శన

టీమిండియా సమిష్టి ప్రదర్శన

ఈ సిరిస్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఇక, బౌలింగ్‌లోనూ భారత్ ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. మరోవైపు బుమ్రా 21 వికెట్లతో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా మిచెల్ స్టార్క్ 13 వికెట్లు మాత్రమే తీశాడు.

1
43626
Story first published: Wednesday, January 9, 2019, 10:58 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X