న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు వికెట్లతో స్టార్క్‌ విజృంభణ.. పాక్ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలం!!

Australia vs Pakistan 2nd Test: Mitchell Starc fire with 6 wickets, Pakistan loose 8 wickets

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆరు వికెట్లతో విజృంభించాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ కనబరుస్తున్న స్టార్క్‌.. చెలరేగడంతో పాక్ బ్యాటింగ్‌ లైనప్‌ ఒక్కసారిగా కకావికలం అయింది. 96/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ను బాబర్‌ అజామ్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యాసిర్‌ షాతో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

సెలెక్టర్ల గురించి ఏమైనా మాట్లాడుకోండి.. నా భార్య పేరును తీసుకురావడం ఎందుకు?: కోహ్లీసెలెక్టర్ల గురించి ఏమైనా మాట్లాడుకోండి.. నా భార్య పేరును తీసుకురావడం ఎందుకు?: కోహ్లీ

మరోవైపు యాసిర్‌ షా కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. జట్టు గాడిలో పడుతుందనగా.. స్టార్క్ పాకిస్తాన్‌ను దెబ్బ కొట్టాడు. స్టార్క్ వేసిన ఓ అద్భుత బంతికి అజామ్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పైన్‌కు దొరికిపోయాడు. అనంతరం షాహిన్‌ ఆఫ్రిది గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దాంతో స్టార్క్‌ ఖాతాలో ఆరో వికెట్‌ చేరింది. రెండో రోజు ఆటలో స్టార్క్‌ నాలుగు వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఫాలోఆన్‌ ప్రమాదం తప్పేట్టు కనబడుటం లేదు. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే పాక్ ఇంకా 140కు పైగా పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో యాసిర్‌ షా (81), మొహమ్మద్ అబ్బాస్ (18) ఉన్నారు. పాక్ 80 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. మొహమ్మద్ మూసా మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కమిన్స్, హేజల్‌వుడ్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది.

పాకిస్తాన్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా 127 ఓవర్లలో 3 వికెట్లకు 589 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (418 బంతుల్లో 335 నాటౌట్‌; 39 ఫోర్లు, సిక్స్‌) ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. తొలి రోజు కనబరిచిన జోరును రెండో రోజూ కొనసాగించిన వార్నర్.. కెరీర్‌లో తొలి 'ట్రిపుల్‌ సెంచరీ' నమోదు చేశాడు. డే/నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ (302 నాటౌట్‌; విండీస్‌పై దుబాయ్‌లో 2016లో) తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌ వార్నర్‌.

Story first published: Sunday, December 1, 2019, 12:06 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X