న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా 14 టెస్టుల్లో ఓటమి.. పాకిస్థాన్‌ ఖాతాలో చెత్త రికార్డు!!

Australia vs Pak Test 2 : Australia's Easy Victory And A 2-0 Series Win || Oneindia Telugu
Australia vs Pakistan: 14 Consecutive Losses In Tests In Australia, Pakistan Created Unwanted World Record

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో (డే/నైట్‌) టెస్టులో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ (7), నాథన్ లియోన్ (5) చెలరేగారు. ఈ ఓటమితో రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 0-2తో కోల్పోయింది.

<strong>ఐపీఎల్‌ వేలానికి 971 మంది క్రికెటర్లు.. స్టార్క్‌ దూరం!!</strong>ఐపీఎల్‌ వేలానికి 971 మంది క్రికెటర్లు.. స్టార్క్‌ దూరం!!

వరుసగా 14 టెస్టుల్లో ఓటమి:

వరుసగా 14 టెస్టుల్లో ఓటమి:

ఈ ఓటమితో పాకిస్తాన్‌ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో వరుసగా అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా పేలవమైన రికార్డును ఖాతాలో వేసుకుంది. పాక్ వరుసగా 14 టెస్టుల్లో ఓటమిపాలైంది. 1999 నుంచి ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై పాక్‌ కనీసం ఒక్క మ్యాచ్‌ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. చివరిసారిగా పాక్ 1995లో విజయం సాధించింది.

20 ఏళ్లలో ఐదోసారి:

20 ఏళ్లలో ఐదోసారి:

ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌ను పాక్‌ గెలవకపోవడం గత 20 ఏళ్లలో ఐదోసారి. 1999లో ఆసీస్‌ 3-0తో సిరీస్‌ను గెలవగా.. 2004, 2009, 2016 పర్యటనలో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌లను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా ఆసీస్‌ 2-0తో గెలుచుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోవడం రెండోసారి. 1972లో తొలిసారి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది.

అక్రమ్‌ తీవ్ర అసంతృప్తి:

అక్రమ్‌ తీవ్ర అసంతృప్తి:

పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్‌ అక్రమ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. నిద్ర మత్తులో ఫీల్డింగ్‌ చేస్తున్నారా అని మండిపడ్డాడు. మరోవైపు ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం పాక్ ఆటతీరు మరి దారుణంగా ఉందని పేర్కొన్నాడు. రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ను ఐస్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డు ట్రోల్‌ చేసింది.

చెలరేగిన స్టార్క్, లియోన్:

చెలరేగిన స్టార్క్, లియోన్:

రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. అనంతరం స్టార్క్ దెబ్బకు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాక్‌ను ఆసీస్‌ ఫాలోఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో లియోన్ ధాటికి పాక్‌ నిలవలేక 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ పర్యటనలో భాగంగా పాక్‌ తలపడిన మూడు టీ20ల సిరీస్‌ను 0-2 తేడాతో, రెండు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో ఓడింది.

Story first published: Tuesday, December 3, 2019, 9:10 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X