న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్‌కు తీవ్ర గాయం.. నొప్పితో మైదానంలోనే విలవిల (వీడియో)!!

India VS West Indies : Aleem Dar Suffers Painful Knee Injury After Colliding With Mitchell Santner
Australia vs New Zealand: Umpire down, Mitchell Santner and Aleem Dar in painful collision

పెర్త్‌: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ డే/నైట్‌ టెస్టులో గాయాల పరంపర ఆగడం లేదు. తొలి రోజు కివీస్‌ పేసర్ లాకీ ఫెర్గూసన్‌ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ గాయంతో ఈ సిరీస్‌కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో రోజు అనూహ్యంగా పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ గాయపడ్డాడు.

<strong>టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. భారత జట్టులోకి దూబే అరంగేట్రం!!</strong>టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. భారత జట్టులోకి దూబే అరంగేట్రం!!

లబుషేన్‌ డిఫెన్స్‌:

లబుషేన్‌ డిఫెన్స్‌:

అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కివీస్‌ పేసర్ టిమ్‌ సౌథి వేసిన బంతిని లబుషేన్‌ డిఫెన్స్‌ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న బర్న్స్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించిగా.. లబుషేన్ నిరాకరించాడు. అప్పటికే సగం క్రీజు వరకు పరిగెత్తిన బర్న్స్‌ తిరిగి వికెట్ల వైపు పరిగెత్తాడు. ఇది గమనించిన సౌథి వెంటనే బంతిని అందుకొని వికెట్లకు త్రో వేశాడు.

అలీమ్‌కు తీవ్ర గాయం:

అలీమ్‌కు తీవ్ర గాయం:

బంతిని బ్యాకప్‌ చేస్తున్న శాంట్నర్‌.. బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన అలీమ్‌ దార్‌ ఒకరిపైఒకరు ఢీ కొట్టకున్నారు. అయితే సాంట్నర్‌ అలీమ్‌ను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదర్లేదు. దీంతో అలీమ్‌ మోకాలికి గాయమైంది. నొప్పిని తట్టుకోలేక అలీమ్‌ మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే న్యూజిలాండ్‌ ఫిజియో వచ్చి అతడికి చికిత్స చేశాడు. అనంతరం అలీమ్‌ తన విధులను కొనసాగించాడు. తొలి టెస్టులో కివీస్‌పై ఆసీస్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది.

స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు:

స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు:

గాయపడినా మైదానాన్ని వీడకుండా.. అంపైరింగ్‌ చేసిన అలీమ్‌ను స్టేడియంలోని ప్రేక్షకులు చప్పట్లతో ప్రశంసించారు. అలీమ్‌ ఇప్పటివరకు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా 129 టెస్టులకు బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో వెస్టిండీస్‌ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ (128) పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్‌ రికార్డును అలీమ్‌ దార్‌ బద్దలు కొట్టారు.

న్యూజిలాండ్‌ సిరీస్‌కు భువనేశ్వర్‌ అనుమానమే.. ఐపీఎల్‌తో పునరాగమనం?!!

2003లో కెరీర్‌ ఆరంభం:

పాకిస్తాన్‌లో దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన 51 ఏళ్ల అలీమ్‌ దార్‌.. దేశం తరపున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలీమ్‌ తన అంపైరింగ్‌ కెరీర్‌ను 2003లో ప్రారంభించారు. ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్‌ అలీమ్‌కు మొదటిది. తన కెరీర్‌లో 207 వన్డేలకు, 46 టీ20లకు అంపైర్‌గా పనిచేసారు. అలీమ్‌ వన్డేల్లో అంపైరింగ్‌ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా మూడు మ్యాచ్‌ల దూరంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్‌ 209 వన్డేలకు అంపైర్‌గా చేసి అగ్ర స్థానంలో ఉన్నారు.

Story first published: Sunday, December 15, 2019, 14:54 [IST]
Other articles published on Dec 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X