న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా: రోహిత్ బలహీనతను ఆసీస్ కనిపెట్టిందా? (వీడియో)

India vs Australia 3rd T20 : Rohit Sharma Clean Bowled by Adam Zampa Video Goes Viral
 Australia vs India 2018: Watch Adam Zampa Gets the Better off Rohit Sharma with a Slider

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బలహీనతను ఆస్ట్రేలియా బౌలర్లు గుర్తించారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ ఔటైన తీరు దీనినే చూచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన రోహిత్ శర్మ (23) క్లీన్ బౌల్డయ్యాడు.

<strong>కోహ్లీపై 'స్లో బంతుల' వ్యూహాం: అలవోకగా చేధించిన కెప్టెన్ (వీడియో)</strong>కోహ్లీపై 'స్లో బంతుల' వ్యూహాం: అలవోకగా చేధించిన కెప్టెన్ (వీడియో)

తొలి పవర్‌ ప్లేలో పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ లెగ్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపా బౌలింగ్‌లో కాస్త ఒత్తిడికి గురైనట్లు కనిపించాడు. ఆడమ్ జంపా సైతం లెగ్‌ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని బంతి విసరగా, పుట్ వర్క్ సాయంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ బౌల్డయ్యాడు.

1
43622
లెగ్ స్పిన్నర్లని ఎదుర్కోవడంలో విఫలమవుతోన్న రోహిత్

లెగ్ స్పిన్నర్లని ఎదుర్కోవడంలో విఫలమవుతోన్న రోహిత్

నిజానికి 2017 ఐపీఎల్ సీజన్ నుంచి రోహిత్ శర్మ లెగ్ స్పిన్నర్లని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. 2018 ఐపీఎల్‌లో సైతం రోహిత్ శర్మ ఎక్కువగా వికెట్లను సమర్పించుకుంది ప్రత్యర్థి జట్టు లెగ్ స్పిన్నర్ లేదా ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ బౌలింగ్‌లోనే కావడం విశేషం. దీంతో మూడో టీ20లో సైతం ఆసీస్ ఈ వ్యూహాన్ని అమలు చేసి సఫలీకృతం అయింది.

రోహిత్ శర్మను ఔట్ ఔట్ చేసిన ఆసీస్ లెగ్ స్పిన్నర్ జంపా

సిడ్నీ వేదికగా జిరిగిన మూడో టీ20లోనూ పవర్ ప్లే ముగిసిన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ శర్మపై ఆడమ్ జంపాని ఆసీస్ ప్రయోగించింది. ఈ క్రమంలో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆడమ్ జంపా రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్

కాగా, ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్‌ (33), ఫించ్‌ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్‌ (25 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌

డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌

ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23), దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 22 నాటౌట్‌) రాణించారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 26, 2018, 13:23 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X