న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు సిరిస్‌తో పాటు అభిమానుల హృద‌యాల్ని కూడా గెలుస్తాం'

Australia Vs India, 1st Test: Gaining respect of country as important as winning: Tim Paine

హైదరాబాద్: గురువారం నుంచి భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లతో పాటు అభిమానుల హృద‌యాల్ని కూడా గెలుస్తామని ఆసీస్ కెప్టెన్ టిమ్‌ పైన్ ధీమా వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం 5.30 గంటల నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది.. తేడాలొస్తే తగ్గే ప్రసక్తే లేదు: కోహ్లీఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది.. తేడాలొస్తే తగ్గే ప్రసక్తే లేదు: కోహ్లీ

ఈ నేపథ్యంలో బుధవారం టిమ్‌ పైన్ మీడియాతో మాట్లాడుతూ "భారత్‌తో గురువారం నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాకి రెండు లక్ష్యాలు ఉన్నాయి. అందులో మొదటిది మ్యాచ్‌లు గెలవడం.. రెండోది అభిమానుల హృద‌యాల్ని గెలవడం. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.

కొన్ని తప్పిదాల్ని సమీక్షించుకోవాలి

కొన్ని తప్పిదాల్ని సమీక్షించుకోవాలి

"అయితే, మైదానంలో మేము కొన్ని తప్పిదాల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. మ్యాచ్‌ల్లో గెలవడం కంటే.. ప్రస్తుత తరుణంలో అభిమానుల మనసులు గెలవడమే మాకు ముఖ్యం. వాటిని సరిదిద్దుకుంటాం" అని టిమ్‌ పైన్ వెల్లడించాడు. ఈ ఏడాది ఆరంభంలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆసీస్ క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌ పాల్పడ్డారు.

ఈ బాల్ టాంపరింగ్ ఉదంతంలో

ఈ బాల్ టాంపరింగ్ ఉదంతంలో

ఈ బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు అడ్డంగా దొరికిపోయారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా... కామెరూన్ బాన్‌క్రాప్ట్‌‌పై తొమ్మిది నెలలు నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా చరిత్ర మసకబారింది.

 ఈ సిరీస్‌లో ఎలాంటి వివాదాలు జోలికీ

ఈ సిరీస్‌లో ఎలాంటి వివాదాలు జోలికీ

అంతేకాదు ఇంటా బయట పరువు పోగొట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు.. మళ్లీ అభిమానుల మనసు గెలుచుకోవాలని ఆశిస్తోంది. ఈ టెస్టు సిరిస్‌ను ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సిరిస్ నేపథ్యంలో 'ఎలైట్ ఆనెస్టీ' అనే పదం గత కొన్నిరోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో నాలుగు రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ఛైర్మన్ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఎర్ల్ ఎడ్డింగ్స్‌ మాట్లాడుతూ "కష్టపడి, కేవలం మంచి క్రికెట్‌ ఆడండి. ప్రజలు మనం ఆట పట్ల గౌరవంతో ఉండాలని మాత్రమే అనుకుంటారు. దానిని గుర్తు పెట్టుకోండి" అని ఆస్ట్రేలియా జట్టు సభ్యులకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌లో ఎలాంటి వివాదాలు జోలికీ వెళ్లకూడదని వారు కోరుకుంటున్నారు.

కష్టపడి ఆడండి కానీ నిజాయతీగా ఉండండి

కష్టపడి ఆడండి కానీ నిజాయతీగా ఉండండి

"కష్టపడి ఆడండి కానీ నిజాయతీగా ఉండండి. గెలిచేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఓటమి పాలైనా... మంచి ఆడే ఓటమి పాలవ్వండి. గెలిస్తే గొప్పలకు పోకండి, ఓడితే తక్కువగా మాట్లాడండి అని ఓ పాత సామెత ఉంది. మనది గొప్ప జట్టని నా అభిప్రాయం. మంచిగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా. సహజంగా మీరు ఆడే ఆట ఆడండి. మీకు సాధ్యమైనంత కష్టపడండి. ఆసీస్ మీ నుంచి అదే కోరుకుంటుంది" అని ఆసీస్ క్రికెటర్లతో చెప్పారు.

Story first published: Wednesday, December 5, 2018, 19:08 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X