న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ స్పిన్నర్లకు చెక్ పెట్టేందుకు!: భారత స్పిన్నర్లతో ఆస్ట్రేలియా నెట్ ప్రాక్టీస్

Australia recruit Indian wrist spinners Jiyas, Sahu to counter Yasir, Shadab

హైదరాబాద్: స్పిన్ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు గాను ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చెందిన ఇద్దరు చైనామన్ స్పిన్నర్లను నియమించుకుంది. ఆస్ట్రేలియా జట్టు త్వరలో పాకిస్థాన్‌తో టెస్టు సిరిస్ ఆడేందుకు గాను యూఏఈ పర్యటనకు బయల్దేరనుంది.

<strong>కెప్టెన్సీ పాఠాలు ఎవరి వద్ద నుంచి నేర్చుకున్నానంటే!: విజ్డెన్‌ క్రికెట్ ఇంటర్యూలో కోహ్లీ</strong>కెప్టెన్సీ పాఠాలు ఎవరి వద్ద నుంచి నేర్చుకున్నానంటే!: విజ్డెన్‌ క్రికెట్ ఇంటర్యూలో కోహ్లీ

ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్లు యాసిర్ షా, షాదబ్ ఖాన్‌లను ఎదుర్కొనేందుకు గాను భారత్‌కు చెందిన స్పిన్నర్లు జియాస్, పర్దీప్ సాహు బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేయనున్నారు. ఆసీస్-పాక్ జట్ల మధ్య తొలి టెస్టు అక్టోబర్ 7న దుబాయి వేదికగా ప్రారంభం కానుంది.

యూఏఈని వేదికగా చేసుకుని మ్యాచ్‌లు ఆడుతోన్న పాక్

యూఏఈని వేదికగా చేసుకుని మ్యాచ్‌లు ఆడుతోన్న పాక్

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ జట్టు యూఏఈని వేదికగా చేసుకుని మ్యాచ్‌లు ఆడుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఎస్ శ్రీరామ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఈ ఇద్దరు స్పిన్నర్లను ఆసీస్ బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు నియమించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 33 ఏళ్ల పర్దీప్ సాహు లెగ్ స్పిన్నర్‌గా రంజీల్లో హర్యానా జట్టు తరుపున 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

రంజీల్లో అరంగేట్రం చేయని జియాస్

రంజీల్లో అరంగేట్రం చేయని జియాస్

ఇక, కేరళకు చెందిన 26 జియాస్ రంజీల్లో తన రాష్ట్రం తరుపున ఇంకా అరంగేట్రం చేయలేదు. కేరళ తరుపున అండర్-19, అండర్-22, అండర్-25 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అంతకముందు 2011-2013 ఐపీఎల్ సీజన్‌లో జియాస్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున డెవలప్‌మెంట్ స్క్వాడ్‌లో సభ్యుడిగా కూడా ఉన్నాడు.

యూఏఈ పర్యటనపై ఆసీస్ పేసర్ పీటర్ సిడ్డిల్ ఇలా

యూఏఈ పర్యటనపై ఆసీస్ పేసర్ పీటర్ సిడ్డిల్ ఇలా

యూఏఈ పర్యటనపై ఆసీస్ పేసర్ పీటర్ సిడ్డిల్ మాట్లాడుతూ "గతంలో కూడా బౌలింగ్‌పై దృష్టి సారించాం. అయితే, ఈసారి మాత్రం స్పిన్ బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మా అదృష్టం కొద్ది అద్భుతమైన స్పిన్ బౌలర్లు మాకు దొరికారు. పాకిస్థాన్ జట్టుకు లెగ్ స్పిన్నర్లు రూపంలో ఇద్దరు అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. గతంలో మేం ఎదుర్కొన్న యాసిర్ షా అద్బుతమైన ఆటగాడు" అని అన్నాడు.

షాదబ్ ఖాన్ బౌలింగ్‌పై ఇప్పటికే చర్చించాం

షాదబ్ ఖాన్ బౌలింగ్‌పై ఇప్పటికే చర్చించాం

"షాదబ్ ఖాన్ బౌలింగ్ గురించి ఇప్పటికే విన్నాం. ఈ ఇద్దరి బౌలింగ్‌పై ఇప్పటికే చర్చించాం. విభిన్నమైన బంతులను వేయడంలో ఈ ఇద్దరూ సరిపాటి. సాహు, జియాస్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ ఇద్దరూ ఎంతో అనుభవం కలిగిన బౌలర్లు. నెట్స్‌లో వీరి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తాం. సాధ్యమైనన్ని ఓవర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల స్పిన్‌పై అవగాహన వస్తుంది. విభిన్న బంతులను ఎలా ఎదుర్కొవాలనే దానిపై ఈ ఇద్దరి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటాం" అని చెప్పాడు.

గత యూఏఈ పర్యటనలో ఆసీస్‌ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు

గత యూఏఈ పర్యటనలో ఆసీస్‌ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు

గత పర్యటనలో పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా యూఏఈలో ఆడినప్పుడు రెండు టెస్టుల్లో కలిపి యాసిర్ షా 12 వికెట్లు తీసుకోగా... మరో స్పిన్నర్ జుల్ఫికర్ బాబర్ 14 వికెట్లు తీసి ఆసీస్ దెబ్బకొట్టారు. దీంతో ఈసారైనా ఆస్ట్రేలియా స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొవాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.

Story first published: Tuesday, September 25, 2018, 17:16 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X