న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

116 ఏళ్ల నాటి రికార్డును ఆసీస్ బద్దలుకొట్టనుందా??

Australia Lose Usman Khawaja, India In Control

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టుకి సొంతగడ్డపై తొలి టెస్టులోనే కఠిన సవాల్ ఎదురైంది. ఒకవేళ ఈ సవాల్‌ను ఎదుర్కొంటే వందేళ ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టినట్లే. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (71: 204 బంతుల్లో 9ఫోర్లు), అజింక్య రహానె (70 బ్యాటింగ్: 147 బంతుల్లో 7ఫోర్లు)హాఫ్ సెంచరీలు బాదడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి భారత్ నిర్దేశించింది.

 దాదాపు 300పైగా లక్ష్యం సాధించాలంటే

దాదాపు 300పైగా లక్ష్యం సాధించాలంటే

బౌలర్లకి అతిగా అనుకూలించే అడిలైడ్‌ పిచ్‌పై 300పైచిలుకు లక్ష్యం ఛేదించడం దాదాపు అసాధ్యమని రికార్డులు చెప్తున్నాయి. ఈ సారి ఆస్ట్రేలియా జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం.. 116 ఏళ్ల నాటి రికార్డు బద్దలవడం ఖాయమనిపిస్తోంది. అడిలైడ్‌లో జరిగిన టెస్టుల్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియా జట్టు 300పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించింది. అది కూడా వందేళ్ల క్రితం.

సుదీర్ఘ చరిత్రలో ఈ 2 చేధనలే రికార్డు

సుదీర్ఘ చరిత్రలో ఈ 2 చేధనలే రికార్డు

1902లో ఇంగ్లాండ్ జట్టు 315 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌కి నిర్దేశించగా ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి అప్పట్లో ఛేదించింది. ఇప్పటి వరకు అడిలైడ్‌ పిచ్‌పై ఇదే అత్యుత్తమం. ఇక ఆఖరిగా 2015లో న్యూజిలాండ్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి కంగారూలు ఛేదించారు. సుదీర్ఘ చరిత్రలో ఈ రెండు చేధనలే ఆస్ట్రేలియాకి అడిలైడ్‌లో విజయవంతం.

 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి

323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి

ఇంతటి భారీ టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు దాదాపు అసాధ్యమే. ఇక భారత బౌలర్లు చక్కగా రాణిస్తే విజయాన్ని త్వరగానే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియాకి తొలి టెస్టులోనే పర్యాటక భారత్ జట్టు సవాల్ విసిరింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (71: 204 బంతుల్లో 9 ఫోర్లు), అజింక్య రహానె (70 బ్యాటింగ్: 147 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి భారత్ నిర్దేశించింది.

దాదాపు టీమిండియా గెలిచినట్లే

దాదాపు టీమిండియా గెలిచినట్లే

టెస్ట్ విజ‌యం కోసం ప‌రిత‌పిస్తున్న ఇండియాకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవ‌కాశాలు సుస్ఫ‌ష్టంగా కనిపిస్తున్నాయి. ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 151/3తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో 307 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 323 పరుగుల టార్గెట్‌ ఆస్ట్రేలియా ముందు నిలిచింది.

1
43623
Story first published: Sunday, December 9, 2018, 12:11 [IST]
Other articles published on Dec 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X