న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ టాంపరింగ్ ఎంత పని చేసింది: క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ షాక్

By Nageshwara Rao
Australia lose major sponsor over ball-tampering scandal

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ వివాదంతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో దోషిగా నిలబడిన ఆస్ట్రేలియా తగిన మూల్యమే చెల్లించుకుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియాకు స్పాన్సర్లు రూపంలో ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది.

ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అతిపెద్ద స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మెగెల్లాన్‌ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న తమ మూడేళ్ల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

'చీట్‌.. చీట్‌' అంటూ హేళన: ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు అవమానం (వీడియో)'చీట్‌.. చీట్‌' అంటూ హేళన: ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు అవమానం (వీడియో)

ఈ విషయాన్ని మగెల్లాన్‌ చీఫ్‌ హమీష్‌ డాగ్లస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇలా ఆకస్మికంగా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం బాధగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన మెగెల్లాన్ ఆగస్టు 2017లో భారీ మెత్తం (20 మిలియన్ల ఆసీస్‌ డాలర్లు) చెల్లించి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో మూడేళ్లపాటు కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

గతేడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌‌కు ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఈ సంస్ధ అతి కొద్ది కాలంలోనే క్రికెట్ ఆస్ట్రేలియాతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ వివాదం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆస్ట్రేలియన్ల తీరుపై దుమ్మెత్తి పోశారు. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తుని ఎక్కడికో తీసకుళ్తాడని అనుకుంటే దేశం పరువు తీశాడు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతామనే సంకేతాలిచ్చి.. తగిన మూల్యం చెల్లించుకున్నారు.

తప్పు చేశారు, చెడ్డవారు కాదు, రెండో అవకాశం ఇవ్వండి: బాల్ టాంపరింగ్‌పై కోచ్ లీమన్తప్పు చేశారు, చెడ్డవారు కాదు, రెండో అవకాశం ఇవ్వండి: బాల్ టాంపరింగ్‌పై కోచ్ లీమన్

బాల్ టాంపరింగ్ ఘటనలో స్మిత్, వార్నర్‌పై సీఏ ఏడాది పాటు నిషేధం విధించింది. సీనియర్ల సూచన మేరకు బాల్ టాంపరింగ్‌కు యత్నించిన బాన్‌క్రాప్ట్‌పై 9 నెలలు నిషేధం విధించింది. తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై చర్యలు తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది.

స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్ చేసిన పనికి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు స్మిత్, వార్నర్‌లతో ఒప్పందం చేసుకున్న పలు కంపెనీలు కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ఇప్పటికే నాలుగేళ్లుగా స్పాన్సర్‌గా ఉన్న ఎల్‌జీ సంస్ధ వార్నర్‌తో కాంట్రాక్ట్‌ను పొడగించబోమని స్పష్టం చేసింది.

Story first published: Thursday, March 29, 2018, 12:43 [IST]
Other articles published on Mar 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X