న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఏ సంచలన నిర్ణయం: ఐదుగురు కొత్తవారికి టెస్టు జట్టులో చోటు

Australia include five uncapped players in Test squad for series against Pakistan

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లోకి ఐదుగురు కొత్త వారికి సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ ఏడాది సఫారీ గడ్డపై జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్రను మసకబారేలా చేసింది.

బాల్ టాంపరింగ్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధంచగా... బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్‌క్రాప్ట్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో, పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా జరగనున్న టెస్టు సిరిస్‌కు కొత్తవారికి చోటు కల్పించారు.

పాక్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్న ఐదుగురిలో మైకేల్ నెసెర్, బ్రెండన్ డాగ్గెట్, మార్మస్ లుబుఛేంజ్, ట్రావిడ్ హెడ్, ఆరోన్ ఫించ్‌లు ఉన్నారు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

గాయం కారణంగా ఆసీస్ పేసర్లు జోష్ హాజెల్‌ఉడ్, ప్యాట్ కుమ్మిన్స్ ఈ సిరిస్‌కు అందుబాటులో లేరు. అయితే, ఈ సిరిస్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై నిషేధం ఉండటంతో ఆస్ట్రేలియా టాపార్డర్‌లో మూడు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.

అయితే, ఈ మూడు స్థానాల్లో ఒకదానిని మ్యాట్ రెన్‌షా‌ భర్తీ చేయనున్నాడు. జట్టు ఎంపికపై ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ ట్రేవర్ హాన్స్ మాట్లాడుతూ "కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారని భావిస్తున్నాం" అని అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్, మ్యాట్ రెన్‌షా, షాన్ మార్ష్, బ్రెండన్ డాగ్గెట్, మిచెల్ నెసెర్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, టిమ్ పైన్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, నాథన్ లియోన్, జోన్ హాలెండ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్.

Story first published: Tuesday, September 11, 2018, 15:26 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X