న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు గెలిచేందుకు సమమైన అవకాశాలున్నాయి: పాంటింగ్

Australia have a model to beat India, says Ricky Ponting

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టుతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సిరీస్‌లోనే తొలి విజయాన్ని నమోదు చేసుకుని శుభారంభాన్ని నమోదు చేసుకోగా.. పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఫలితాలను ఇరుజట్లు సమం చేసుకున్నాయి. తమ ఆధిక్యం చూపించేందుకు బాక్సింగ్ డే టెస్టును అవకాశంగా భావిస్తున్నాయి భారత్-ఆసీస్‌లు. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయాన్ని అందుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పిలుపునిచ్చాడు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌పై భారీ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ, వైస్ కెప్టెన్ అజింకా రహానె సెంచరీలు ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు.

 విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాదు

విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాదు

ఈ క్రమంలో పాంటింగ్.. ఆస్ట్రేలియా జట్టుతో 'ఇది విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాదు. రెండో టెస్టులో గెలిచిన విధంగా బాక్సింగ్ టెస్టులోనూ రాణించాల్సి ఉంది. ఇప్పుడే మొదలైన ఆటతీరును కొనసాగించాలి. గెలిచింది ఒక్క మ్యాచే తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తారా అనే సందేహమే లేదు. మెల్‌బౌర్న్ కచ్చితంగా గెలుస్తారనే నమ్మకముంది. పెర్త్‌లో చేసిందే మెల్‌బౌర్న్‌లోనూ చేయాలి.

ఆసీస్ గడ్డపై గెలిచిన దాఖలాల్లేవ్

ఆసీస్ గడ్డపై గెలిచిన దాఖలాల్లేవ్

ఆస్ట్రేలియా జట్టు గెలవాలని సూచించిన పాంటింగ్.. భారత్‌ కూడా రాణించే అవకాశాలన్నాయని వెల్లడించాడు. భారత్ మళ్లీ తన ఫామ్‌ను పుంజుకోవడానికి మూడు, నాలుగు టెస్టులు జరగనున్న మెల్‌బౌర్న్, సిడ్నీ స్టేడియంలు బాగా కలిసొస్తాయని తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు విజయం భారత్ చేసిన ఆస్ట్రేలియా పర్యటనల్లో మొదటి విజయం. ఇప్పటి వరకూ ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో భారత్ గెలిచిన దాఖలాల్లేవు. ఇదిలా ఉంచితే పెర్త్ వేదికగా ఆసీస్ గెలిచిన టెస్టు మ్యాచ్ కెప్టెన్‌గా టిమ్ పైనె కెరీర్‌లో మొదటిది.

ఇంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు

ఇంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు

శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 19, 2018, 17:03 [IST]
Other articles published on Dec 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X