న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న బౌలర్.. బంతి తలకు తగిలుంటే!!

Australia Fast Bowler Mickey Edwards Escape After Batsman Smashes Shot Straight At Him

సిడ్నీ: తనవైపు దూసుకొచ్చిన బంతి నుంచి ఓ ఫాస్ట్ బౌలర్‌ తెలివిగా తప్పించుకోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ బంతి తలకు తగులుంటే పెద్ద ఘోరమే జరిగేది. విషయంలోకి వెళితే... ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్‌, క్వీన్స్‌లాండ్‌ జట్లు తలపడ్డాయి. న్యూసౌత్‌వేల్స్‌ ఫాస్ట్ బౌలర్‌ మిక్కీ ఎడ్వర్డ్స్‌ బౌలింగ్‌ చేస్తున్న క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

<strong>తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా కమ్రాన్‌ అక్మల్‌ అరుదైన రికార్డు!!</strong>తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా కమ్రాన్‌ అక్మల్‌ అరుదైన రికార్డు!!

స్వల్ప గాయాలు:

మిక్కీ ఎడ్వర్డ్స్‌ వేసిన ఓ బంతిని క్వీన్‌లాండ్స్‌ బ్యాట్స్‌మన్‌ సామ్యూల్‌ హీజ్‌లెట్‌ స్టైట్‌ డ్రైవ్‌ కొట్టాడు. ఒక్కసారిగా బంతి తన తలపైకి దూసుకురావడంతో.. తప్పించుకునేందుకు బౌలర్‌ చెయ్యి అడ్డు పెట్టాడు. అయితే బంతి బలంగా వీపును తాకడంతో ఎడ్వర్డ్స్‌ కిందపడ్డాడు. ఈ క్రమంలో ఎడ్వర్డ్స్‌ చేతికి గాయం అయింది. దీంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఒకవేళ బంతి తలకు తగిలి ఉంటే.. పెద్ద ఘోరమే జరిగేది.

భయాందోళలో లబూషేన్‌:

భయాందోళలో లబూషేన్‌:

మిక్కీ ఎడ్వర్డ్స్‌ ఆ బంతిని తప్పించుకునే క్రమంలో నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో ఉన్న ఆసీస్ ఆటగాడు లబూషేన్‌ భయాందోళనకు గురయ్యాడు. ఎందుకంటే.. యాషెష్ సిరీస్లో ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి అతన్ని బెంబేలెత్తించింది. గతంలో ఆసీస్‌ ఆటగాడు ఫిల్ హ్యూజ్‌ తలకు బంతి తగిలి మృతి చెందగా.. ఇటీవల ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్చర్‌ వేసిన బంతి మెడ వెనుక భాగంలో బలంగా తగలడంతో.. స్మిత్ ఫీల్డ్‌లో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను తేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

దేవుడిని ధన్యవాదాలు:

దేవుడిని ధన్యవాదాలు:

ఈ ప్రమాదకర ఘటనకు సంబందించిన వీడియోను 'ఆస్ట్రేలియా క్రికెట్' తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 'అదృష్టవశాత్తూ మిక్కీ ఎడ్వర్డ్స్‌ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుడిని ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఎంతోమంది ఈ వీడియోను చూసి.. ఎడ్వర్డ్స్‌ లక్కీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎడ్వర్డ్స్‌ తృటిలో ఒక భయానక క్షణం నుంచి బయటపడ్డందుకు ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పాలని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

Story first published: Monday, September 23, 2019, 9:26 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X