శిక్ష తీవ్రత ఎక్కువగా ఉంది: స్మిత్‌కు మద్దతు, సానుభూతి (ఫోటోలు)

Posted By:
Australia ball-tampering scandal: Outpouring of sympathy for Steve Smith on Twitter; David Warner gets little support

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన ఘటన. ఈ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా... బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించిన ఓపెర్ బాన్‌క్రాప్ట్‌కు 9 నెలలు నిషేధం విధించింది.

నిషేధం అనంతరం స్వదేశానికి చేరుకున్న స్టీవ్ స్మిత్ సిడ్నీ విమానాశ్రయంలో మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ మీడియా సమావేశంలో స్మిత్ 'నేను ఎవరినీ నిందించడం లేదు. నేను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ని. గత శనివారం ఏదైతే జరిగిందో అందుకు కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా' అని స్మిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఆ తర్వాత స్మిత్‌పై క్రికెట్‌ ప్రపంచం నుంచి సానుభూతి ప్రదర్శిస్తోంది. అంతేకాదు బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో పలువురు భారత క్రికెటర్లు కూడా ఉండటం విశేషం.

రోహిత్‌ శర్మ

రోహిత్‌ శర్మ

విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి.

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌

సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం.

సచిన్‌ టెండూల్కర్‌

సచిన్‌ టెండూల్కర్‌

వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది.

డుప్లెసిస్

డుప్లెసిస్

స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్‌ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్‌.

మైకేల్‌ వాన్‌

మైకేల్‌ వాన్‌

మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు. నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి.

 షోయబ్‌ అక్తర్‌

షోయబ్‌ అక్తర్‌

స్మిత్‌ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్‌ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 13:22 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి