న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Playing XI for 3rd ODI: రెండు మార్పులతో బరిలోకి ఆసీస్

India vs Australia 3rd ODI: Australia Team Has Made Two Changes To Win Against Team India | Oneindia
Australia announce playing XI for 3rd ODI; Nathan Lyon benched, Jason Behrendorff out with sore back

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం మెల్‌బోర్న్‌లో వేదికగా జరగబోయే మూడో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు స్వల్ప మార్పులు చేసింది. శుక్రవారం నాటి వన్డేతో ఆసీస్ గడ్డపై టీమిండియా పర్యటన ముగియనుంది. దీంతో తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయంతో ఆసీస్ పర్యటనను ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.

<strong>మనుషులు కాబట్టే తప్పు చేశారు: పాండ్యా, రాహుల్‌పై గంగూలీ</strong>మనుషులు కాబట్టే తప్పు చేశారు: పాండ్యా, రాహుల్‌పై గంగూలీ

ఆసీస్ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన మూడు టీ20ల సిరిస్ సమం కాగా, ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 2-1తో కైవసం చేసుకుని తొలిసారి ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై కనీసం వన్డే సిరీస్‌నైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు చూస్తోంది. ఆస్ట్రేలియా వన్డే సిరిస్ గెలవక సుమారు రెండేళ్లు అవుతుంది.

ఈ రెండేళ్ల కాలంలో 23 వన్డేలాడిన ఆస్ట్రేలియా జట్టు కేవలం నాలుగు వన్డేల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఎంతో కీలకమైన మూడో వన్డే కోసం గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా తుది జట్టుని ప్రకటించింది. ఈ తుది జట్టులో ఆసీస్ జట్టు మేనేజ్‌మెంట్ రెండు మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది.

సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ స్థానంలో ఆడమ్ జంపా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్ తుది జట్టులోకి వచ్చారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నాథన్ లియాన్ ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో చివరి వన్డేకి అతడిని పక్కన పెట్టారు.

Story first published: Thursday, January 17, 2019, 17:01 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X