న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: పసికూన చేతిలో చెమటలు కక్కిన పాక్

By Pratap

మిర్పూర్‌: ఆసియా కప్‌లో మరో సంచలన విజయం కొద్దిలో తప్పిపోయింది. పసికూన యూఏఈ బలమైన పాకిస్థాన్ జట్టునుఓడించినంత పని చేసింది. సోమవారం జరిగిన రౌండ్‌ రాబిన్ లీగ్‌ మ్యాచ పాక్‌ 7 వికెట్ల తేడాతో యూఏఈపై చెమటోడ్చి గెలిచి ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

షైమన అన్వర్‌ (46) ఆదుకోవడంతో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. మహ్మద్‌ ఆమెర్‌, మహ్మద్‌ ఇర్ఫాన చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్‌ 3 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ షోయబ్‌ మాలిక్‌ (63 నాటౌట్‌), ఉమర్‌ అక్మల్‌ (50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. జావెద్‌ 3 వికెట్లు తీశాడు.

Asia Cup T20: Shoaib Malik, Umar Akmal steer Pakistan to victory against UAE


పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పాక్‌ స్వల్ప లక్ష్య ఛేదనలో సమస్యలు ఎదుర్కొంది. యూఏఈ పేసర్‌ జావేద్‌ నిప్పులు చెరగడంతో పాక్‌ టాపార్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు మహ్మద్‌ హఫీజ్‌ (11), షర్జీల్‌ ఖాన్ (4) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. ఖుర్రమ్‌ మంజూర్‌ (0) డకౌట్‌ కావడంతో పాక్‌ 17 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది.
Asia Cup T20: Shoaib Malik, Umar Akmal steer Pakistan to victory against UAE


టాపార్డర్‌ విఫలమైనా షోయబ్‌ మాలిక్‌-ఉమర్‌ అక్మల్‌ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఈ క్రమంలో షోయబ్‌ 44, అక్మల్‌ 46 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X