న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా వాళ్లకు ఓటమి భయం పట్టుకుంది: పాక్ కోచ్

Asia Cup 2018: Ind vs Pak : Mickey Arthur Talks About Pak Team

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా భారత్.. పాకిస్తాన్‌తో తలపడి రెండో సారి విజేతగా నిలిచింది. ఈ ఓటమిపై పాకిస్తాన్‌ను సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్ కూడా విశ్లేషణతో పాటు విమర్శలకు దిగుతున్నాడు. సూపర్ 4లో అర్హత సాధించిన టీమిండియా.. పాక్‌లు దుబాయి వేదికగా ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.

 మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే

మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే

ఓపెనర్లు శిఖర్ ధావన్ (114), రోహిత్ శర్మ (111 నాటౌట్)లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా గెలుపొందింది. ఇలా రెండో సారి ఆడిన మ్యాచ్‌లోనూ వరుసగా ఓటమికి గురి కావడంతో సాధారణ క్రికెట్ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

'ఇదొక బోరింగ్ గేమ్.. దేశం మొత్తం నిరాశ'

పాక్.. ఆత్మవిశ్వాస లేమితో :

పాక్.. ఆత్మవిశ్వాస లేమితో :

వారితో పాటుగా తమ జట్టు ప్రస్తుతం ఆత్మవిశ్వాస లేమితో కొట్టుమిట్టాడుతోందని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌పై పాక్ ఆటతీరు పట్ల పెదవి విరిచిన ఆయన.. తమ జట్టు చేసిన చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని విమర్శించాడు. మా ఆటగాళ్లు కాన్ఫిడెన్స్ క్రైసిస్‌తో బాధపడుతున్నారు. డ్రెస్సింగ్ రూంలో ఓటమి భయం ఉంది. క్రికెట్ జట్టుగా మేం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సి ఉందని ఆర్థర్ తెలిపాడు.

బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు,

బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు,

‘భారత్‌లో చాలా మంచి ఆటగాళ్లున్నారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆదివారం జరిగిన మ్యాచ్2లో అదే జరిగింది. బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు, బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలి. మాకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తే ఆధిపత్యం చెలాయిస్తారు. మేం వాస్తవికంగా ఆలోచించాలి. అద్భుతమైన భారత జట్టు చేతిలో ఓడాం. మా ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నార'ని ఆర్థర్ చెప్పాడు.

బుమ్రా ప్రాక్టీస్ 20 నిమిషాలపాటు చూశా:

బుమ్రా ప్రాక్టీస్ 20 నిమిషాలపాటు చూశా:

బుమ్రా మ్యాచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 20 నిమిషాలపాటు చూశాను. అతడు వరుసగా యార్కర్ల మీద యార్కర్లు సంధించాడు. మా యంగ్ బౌలర్లు ఇలా వేయడం నేర్చుకోవాలి. డెత్ ఓవర్లలో భువీ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఆర్థర్ తెలిపాడు.

Story first published: Monday, September 24, 2018, 16:04 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X