న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ 2018: భారత్‌ను పాక్ తప్పకుండా ఓడిస్తుంది

Asia Cup 2018: Younis Khan, Aamer Sohail back Pakistan to beat India

హైదరాబాద్: యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్‌‌లో భారత్‌ను ఓడించే సత్తా తమ దేశానికి ఉందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు యూనిస్‌ ఖాన్‌, ఆమీర్‌ సోహైల్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 19న దుబాయిలో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

<strong>రవిశాస్త్రి కోరిక: షెడ్యూల్‌లో మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకారం</strong>రవిశాస్త్రి కోరిక: షెడ్యూల్‌లో మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకారం

ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే ఆ మ్యాచ్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం సగటు అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అంతేకాదు చాలా కాలం తర్వాత ఇరు దేశాలు మైదానంలో తలపడుతుండడంతో ఆసక్తి నెలకొంది.

గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను పాకిస్థాన్‌ 180 పరుగుల తేడాతో ఓడించి మంచి జోరు మీదుంది. ఆ తర్వాత ఇరు దేశాలు తలపడుతున్న మ్యాచ్ కావడంతో తాజాగా, యూనిస్‌ మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ జట్టులో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నారని, వారు టీమిండియాను ఓడిస్తారని అన్నాడు.

<strong>తొలిసారి మూడో స్థానం: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సరికొత్త చరిత్ర</strong>తొలిసారి మూడో స్థానం: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సరికొత్త చరిత్ర

"గెలుస్తామనే దృక్పథంతోనే పాక్ ఆటగాళ్లు మైదానంలోకి వెళితే ఆసియా కప్‌లో భారత్‌ను తప్పకుండా ఓడిస్తారని అనుకుంటున్నాను" అని యూనిస్ ఖాన్‌‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు మాజీ ఆటగాడు సోహైల్‌ మాట్లాడుతూ "ఈ ఇరు జట్లు చాలా బలమైనవి. వీటి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. యూఏఈలో గతంలో పాకిస్థాన్ ఆడిన విధానాన్ని చూస్తే అన్ని జట్ల కన్నా పాక్‌దే పై చేయి" అని అన్నాడు.

సెప్టెంబర్ 18న హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. తర్వాతి రోజు (19న) పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకుంటుంది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయి వేదికగానే జరగనుండటం విశేషం. ఆసియా కప్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు.

టోర్నీలో భాగంగా శనివారం గ్రూప్‌-బిలోని బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత జట్టు కొంత మంది ఆటగాళ్లు ఇప్పటికే దుబాయికి చేరుకుంది. మరికొంత మంది ఆదివారం దుబాయికి బయల్దేరి వెళ్లనున్నారు. టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి.

<strong>పాక్ పేసర్ ఆమిర్‌ను ఎదుర్కొనేందుకు లంక బౌలర్ నువాన్‌తో టీమిండియా ప్రాక్టీస్</strong>పాక్ పేసర్ ఆమిర్‌ను ఎదుర్కొనేందుకు లంక బౌలర్ నువాన్‌తో టీమిండియా ప్రాక్టీస్

భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ఆసియా కప్ టైటిల్ రేసులో ఉన్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

సూపర్ ఫోర్ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.

Story first published: Saturday, September 15, 2018, 18:01 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X