న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ 2018: కోహ్లీకి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

By Nageshwara Rao
Asia Cup 2018: Virat Kohlis Workload In Focus As Selectors Eye A Balanced Side

హైదరాబాద్: వర్క్‌లోడ్ కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్‌లో విశ్రాంతి కల్పించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఆసియా కప్‌కు సిద్ధం కానుంది.

సెప్టెంబర్ 15 నుంచి దుబాయ్‌, అబుదాబి వేదికగా ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం ఇప్పటి నుంచే సెలక్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వరుస్ మ్యాచ్‌లతో కోహ్లీపై వర్క్‌లోడ్ ఎక్కువ అవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.

 కోహ్లీపైనే బ్యాటింగ్ భారం

కోహ్లీపైనే బ్యాటింగ్ భారం

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీనే మోయడం.. రెండో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడటం సెలక్టర్లను కలవరపెడుతోంది. ఇక, ఆసియా కప్ అనంతరం టీమిండియా రాబోయే మూడు నెలల్లో మొత్తం ఆరు టెస్టు మ్యాచ్‌లు(వెస్టిండిస్‌తో రెండు, ఆస్ట్రేలియాతో నాలుగు) ఆడనుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడమే మేలు అని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఇదే గనుక జరిగితే ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్‌ శర్మ నిర్వహించనున్నాడు. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో టీమిండియా రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దీంతో సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి కల్పిస్తే సమస్య ఎదురువుతందునే దానిపై కూడా సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే, ఆసియా కప్‌లో మిడిలార్డర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంది.

ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలున్నారు. వీరికి బ్యాకప్‌గా కేఎల్‌ రాహుల్‌, లేకుంటే జట్టు పరిస్థితిని బట్టి వన్‌డౌన్‌లో దింపే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో మిడిలార్డర్‌ను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల భారత్‌-బి, భారత్‌-ఏ జట్ల తరపున రాణించిన మనీష్‌ పాండే, అంబటి రాయుడులను ఆసియా కప్‌ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్

గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్

గాయంతో జట్టుకు దూరమైన కేదార్‌ జాదవ్‌ కూడా కోలుకున్నాడు. మిడిలార్డర్‌ను పరీక్షించేందుకు గాను మయాంక్‌ అగర్వాల్‌ను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక, భారత్‌ ఏ తరపున మయాంక్ అగర్వాల్‌ గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కాగా, మయాంక్ అగర్వాల్‌కు రాహుల్‌, ధావన్‌, రోహిత్‌ల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. రాహుల్‌కు విశ్రాంతిస్తే అగర్వాల్‌కు అవకాశం వస్తుంది.

గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌

గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌

ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌, బుమ్రాలు ఆసియా కప్‌లో బాలింగ్ విభాగాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. ధోనికి బ్యాకప్‌గా వికెట్ కీపర్‌గా రిషబ్‌ పంత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టెస్టు సిరీస్‌ రిషబ్ పంత్ రాణిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 31, 2018, 16:14 [IST]
Other articles published on Aug 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X