న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టోర్నీ విజేతకు ఇచ్చే ఆసియా కప్ ట్రోఫీని చూశారా?

By Nageshwara Rao
Asia Cup 2018: UAE Minister Launches Asian Cup For The Winner
Asia Cup 2018 Trophy Unveiled In Dubai

హైదరాబాద్: సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా భారత్‌ 18న తన తొలి మ్యాచ్‌ను హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజైన బుధవారం టీమిండియా దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఆసియా కప్ చరిత్ర, మ్యాచ్ రికార్డులు, గణాంకాలను తెలుసుకోండిఆసియా కప్ చరిత్ర, మ్యాచ్ రికార్డులు, గణాంకాలను తెలుసుకోండి

ఇందులో భాగంగా శుక్రవారం ఆసియా కప్‌ టోర్నీలో విజేతగా నిలిచే జట్టు అందించే ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ మంత్రి షేక్‌ నయన్‌ బిన్‌ ముబారక్‌ ఆల్‌ నయన్‌ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలతో పాటు, వీడియోను భారత క్రికెట్ జట్టు తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా అభిమానులతో పంచుకుంది.

హైఓల్టేజ్ మ్యాచ్‌గా భారత్-పాక్ మ్యాచ్

హైఓల్టేజ్ మ్యాచ్‌గా భారత్-పాక్ మ్యాచ్

ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌ని అభిమానులు హైఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్క్ లోడ్, రాబోయే ఉన్న సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు ఈ టోర్నీ నుంచి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను ఎంపిక చేసిన సెలక్టర్లు, వైస్ కెప్టెన్‌గా ఓపెన్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశారు. ఈ ఆసియా కప్‌లో భారత్‌తో సహా మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు కూడా సూపర్-4 స్టేజికి అర్హత సాధిస్తాయి.

50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్

ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. భారత జట్టు ఆరు సార్లు ఆసియా కప్‌ను ఎక్కువ సార్లు కైవసం చేసుకుంది.

ఆరు సార్లు టైటిల్ విజేతగా టీమిండియా

ఆరు సార్లు టైటిల్ విజేతగా టీమిండియా

భారత్ ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఈ ట్రోఫీని నెగ్గాయి. బంగ్లాదేశ్ అత్యధికంగా ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 2014 వరకు జరిగిన ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించేవారు. 2015 నుంచి ఈ టోర్నీని వన్డే, టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.

Story first published: Saturday, September 8, 2018, 13:54 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X