న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భిన్నాభిప్రాయాలు: పాక్ గెలుస్తుందని గవాస్కర్, కాదు భారతే అని అక్రమ్

Asia Cup 2018: Sunil Gavaskar supports Pakistan, Wasim Akram picks India

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పాక్ గెలుస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ తెలిపాడు.

భారత్ Vs పాకిస్థాన్: పేసర్ భువీ తండ్రి ఏమన్నారంటే!భారత్ Vs పాకిస్థాన్: పేసర్ భువీ తండ్రి ఏమన్నారంటే!

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని కారణంగా.. పాక్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అందుకే పాక్‌కు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గతేడాది లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన సంగితి తెలిసిందే.

మరో మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా గవాస్కర్‌కు మద్దతు పలికాడు. పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయాక పాక్‌కు యూఏఈనే సొంతగడ్డగా మారిందని, ఇక్కడి పిచ్‌లు వారికి కొట్టిన పిండి అని, అందుకే పాక్‌ను ఆసియా కప్‌ ఫేవరెట్‌గా సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌లో గెలిచేదెవరు?: పాక్‌కే గెలిచే ఛాన్స్‌లెక్కువ!ఆసియా కప్‌లో గెలిచేదెవరు?: పాక్‌కే గెలిచే ఛాన్స్‌లెక్కువ!

ఈ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించాలంటే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉందని మంజ్రేకర్ తెలిపాడు. ఈ ఏడాది కాలంలో పాకిస్థాన్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక్క న్యూజిలాండ్‌ సిరీస్‌లో మాత్రమే ఓడిందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. శ్రీలంక, జింబాబ్వేలపై వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆస్ట్రేలియా కూడా పాల్గొన్న టీ20 సిరీస్‌లో విజేతగా నిలిచింది.

ఇక, పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పేపర్‌ మీద చూస్తే భారతే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, కోహ్లీ లేకపోవడం పాకిస్థాన్‌ బౌలర్లకు మానసికంగా ఎంతో బలాన్నిస్తుంది. ఒకప్పుడు గావస్కర్‌, అజహర్‌, సచిన్‌ లాంటి వాళ్లు భారత జట్టులో లేకుంటే నాలో ఆత్మవిశ్వాసం పెరిగేది" అని అక్రమ్ తెలిపాడు.

Story first published: Wednesday, September 19, 2018, 16:48 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X