న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: 14 నెలలు తర్వాత వన్డేల్లోకి జడేజా పునరాగమనం

Asia Cup 2018 : Jadeja : I Returned To The Team After A Gap Of Around 480 Days
Asia Cup 2018: Ravindra Jadeja returns to ODI cricket after 14 months

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ వన్డేల్లోకి పునరాగమనం చేశాడు. బుధవారం ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సెలక్టర్లు అతని స్థానంలో అనూహ్యంగా రవీంద్ర జడేజా చోటుకు చోటు కల్పించారు.

భారత్‌తో మ్యాచ్: 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా భారత్‌తో మ్యాచ్: 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా

ఆసియా కప్ టోర్నీలో భాగంగా దుబాయి వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌‌లో తుది జట్టులో ఒక మార్పు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాకి చోటు కల్పించాడు. గతేడాది జులైలో వెస్టిండిస్‌తో జడేజా చివరిసారిగా తన వన్డే మ్యాచ్ ఆడాడు.

ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 0/27తో నిరాశపరిచాడు. ఆ తర్వాత జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ 3.3 ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకోవడంతో అతడిని సెలక్టర్లు పక్కన పెడుతూ వచ్చారు. దీనికి తోడు భారత చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ రాణిస్తుండటంతో ఏడాదిగా జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచులు ఆడామని, చేజింగ్ ఈజీగా ఉండటం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఈ టోర్నీలో గ్రూప్ దశలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్థాన్‌పై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది.

ఇక ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా టీమ్‌లోకి వచ్చాడు. అటు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, ముస్త‌ఫిజుర్ రెహ‌మాన్ తుజి జట్టులోకి వచ్చారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై 137 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్.. గురువారం పసికూన ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.

దీంతో బంగ్లాదేశ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 33సార్లు తలపడగా భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఏడో స్థానంలో ఉంది.

Story first published: Friday, September 21, 2018, 18:12 [IST]
Other articles published on Sep 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X