న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు ఎదురుదెబ్బ: ఆసియా కప్‌ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్

Asia Cup 2018 : Hardik Pandya Ruled Out With Injury
Asia Cup 2018: Injured Hardik Pandya to miss the tournament

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే.

ఆసియా కప్: మ్యాచ్‌కి హైలెట్‌గా మారిన రోహిత్ సిక్సు(వీడియో)ఆసియా కప్: మ్యాచ్‌కి హైలెట్‌గా మారిన రోహిత్ సిక్సు(వీడియో)

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా అదే ఓవర్ ఐదో బంతిని వేసిన తర్వాత ఒక్కసారిగా మైదానంలో కూప్పకూలాడు. బంతిని వేసిన తర్వాత కుడి కాలును నేలపై సరిగా వేయడంలో పాండ్యా ఇబ్బందిపడ్డాడు. బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో తన నడుముని పట్టుకొని పిచ్‌పై పడుకున్నాడు.

మైదానంలో కూప్పకూలిన హార్దిక్ పాండ్యా

కనీసం నిల్చునే పరిస్థితి కూడా లేకపోవడంతో పిచ్ పక్కనే పడిపోయాడు. క్రీజులో ఉన్న పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్, టీమిండియా సహచరులు వచ్చి కాస్త లేపే ప్రయత్నం చేసినా నొప్పి తీవ్రతకు కనీసం కదల్లేకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. అప్పటికే జట్టు ఫిజియో మైదానంలోకి చేరుకొని అతని గాయాన్ని పరిశీలించారు.

గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో

గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో

గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో స్ట్రెచర్ తీసుకువచ్చి వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. పాండ్యా వెళ్లిపోవడంతో అతని స్థానంలో 18వ ఓవర్ చివరి బంతికి అంబటి రాయుడు వేశాడు. హార్దిక్ పాండ్యాకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలిందని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

 పాండ్యా స్థానంలో దీపక్ చాహార్

పాండ్యా స్థానంలో దీపక్ చాహార్

ప్రస్తుతానికి అతను లేచి నిలబడగలిగే పరిస్థితుల్లో ఉన్నా.. మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ హార్ధిక్ పాండ్యాకు వైద్యులు లేదని తేల్చి చెప్పారు. ఆసియా కప్ టోర్నీ కోసం పాండ్యా స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌ను జట్టులోకి ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. గురువారం అతడు జట్టుతో కలవనున్నాడు.

దుబాయిలో మండుతోన్న ఎండలు

ప్రస్తుతం దుబాయ్‌లో ఎండలు మండుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఎడారి ప్రాంతం దుబాయ్‌లో వేడికి ఆటగాళ్లు ఉడికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీలు దాటి ఎండ కాస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు. పరుగులు తీయాలన్నా శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు సాధన చేశారు. ఎండకు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని మంచినీటి సీసాలను మెడపై పెట్టుకున్నారు. కొందరేమో ఐస్ ‌డబ్బాలో తలపెట్టేశారు. ఇంకొకరేమో టోపీలో మంచు గడ్డలు వేసుకొని తలకు పెట్టుకున్నారు.

అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్‌ కూడా ఔట్

అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్‌ కూడా ఔట్

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత పనిచేసింది. వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ టోర్నీకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరంగా.... తాజాగా స్పిన్నర్ అక్షర పటేల్, పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌లు సైతం గాయాలు కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అక్షర పటేల్ చేతి వేలుకి తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. మరోవైపు గాయం కారణంగా టోర్నీకి దూరమైన శార్దూల్ స్థానంలో సిద్దార్థ్ కౌల్‌ను ఎంపిక చేశారు.

Story first published: Thursday, September 20, 2018, 14:39 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X