న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠపోరులో టీమిండియా విక్టరీ

Asia Cup 2018 : Unimpressive India Beat Spirited Hong Kong By 26 Runs
Asia Cup 2018: India avoid shock defeat by Hong Kong

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన మంగళవారం మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యఛేదనలో హాంకాంగ్.. ఖలీల్ అహ్మద్(3/48), చాహల్(3/46), కుల్దీప్(2/42) ధాటికి 50 ఓవర్లలో 259/8 స్కోరు చేసింది.

భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన హాంకాంగ్ అంచనాలకు మించి రాణించింది. కడదాకా పోరాడిన హాంకాంగ్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి.. విజయానికి 26 పరుగుల దూరంలో నిలిచింది.

ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'

ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'

ఓపెనర్లు నిజాకత్ ఖాన్(115 బంతుల్లో 92, 12ఫోర్లు, సిక్స్), అన్షుమన్ రాత్(97 బంతుల్లో 73, 4ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. తొలుత ధావన్(120 బంతుల్లో 127, 15 ఫోర్లు, 2సిక్స్‌లు), రాయుడు(70 బంతుల్లో 60, 3ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 285/7 స్కోరు చేసింది. కేడీ షా(3/39), ఎహసాన్‌ఖాన్(2/65) ఆకట్టుకున్నారు. సెంచరీతో రాణించిన ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

టాస్ గెలిచి.. మొదట భారత్‌కు బ్యాటింగ్ :

టాస్ గెలిచి.. మొదట భారత్‌కు బ్యాటింగ్ :

టాస్ గెలిచిన హాంకాంగ్ మొదట భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్... శిఖర్ ధావన్‌ సెంచరీ, అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 285 చేసింది. 300 పైగా స్కోరు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. స్లాగ్ ఓవర్లలో వికెట్ కోల్పోవడంతో భారత్ 285 పరుగులకే పరిమితమైంది.

ధావన్‌ మరోసారి అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో

ధావన్‌ మరోసారి అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో

ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శిఖర్‌ ధావన్‌ మరోసారి తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి చెలరేగిపోయాడు. శిఖర్‌ ధావన్‌ (127) 120 బంతుల్లో 15ఫోర్లు, 2సిక్సు, ఎనిమిదో ఓవర్లో రోహిత్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 45. స్పిన్నర్‌ ఎహ్‌సాన్‌ బౌలింగ్‌లో మిడాన్‌లో రోహిత్‌ తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రాయుడు (60) 70 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులతో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరూ స్ట్రైక్‌రొటేట్‌ చేసుకుంటూ వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ సాగిపోయారు.

భారీ స్కోరు చేసేలా కనిపించినా.. తడబాటుతో:

భారీ స్కోరు చేసేలా కనిపించినా.. తడబాటుతో:

30వ ఓవర్లో రాయుడును ఎహ్‌సాన్‌ నవాజ్‌ ఔట్‌ చేసి, 116 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీసేటప్పటికి స్కోరు 161. అప్పటికి ధావన్‌ 84 బంతుల్లో 77 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత అతడు వేగం పెంచాడు. ధావన్‌కు దినేశ్‌ కార్తీక్‌ (33) 38 బంతుల్లో 3ఫోర్లు సహకరించడంతో భారత్‌ 40 ఓవర్లలో 237/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అప్పటికి ధావన్‌ సెంచరీ పూర్తి చేశాడు. టీమిండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఆఖరి పది ఓవర్లలో అనూహ్యంగా తడబడింది. కేవలం 48 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ధోని డకౌటయ్యాడు.

Story first published: Wednesday, September 19, 2018, 9:52 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X